చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి. సుశీల
సంగీతం: జి. కె. వెంకటేష్
పల్లవి:
పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...
చరణం 1:
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మూపులపైన మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాలపేట మధురామృతాల తేట
ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...
చరణం 2:
త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడునాడులుకదిలించేది వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట
ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...
చరణం 3:
ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ మెళ్ళో తాళి కాళ్లకు పారాణి మెరిసే కుంకుమబొట్టు ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడే తెలుగుతల్లి పెట్టనికోట తెలుగునాట ప్రతిచోట ఒకపాట... పాడనా తెనుగుపాట... పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగుపాట...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి