America Ammayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
America Ammayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జనవరి 2025, శుక్రవారం

America Ammayi : Anandha Tandavamaade Song Lyrics (ఆనంద తాండవమాడే)

చిత్రం: అమెరికా అమ్మాయి (1976)

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

గానం: పి. సుశీల

సంగీతం: జి. కె. వెంకటేష్



పల్లవి:

ఆ..ఆ..ఆ..
ఆనంద తాండవమాడే
ఆనంద తాండవమాడే.. శివుడు
అనంతలయుడు.. చిదంబర నిలయుడు
ఆనంద తాండవమాడే...
నగరాజసుత చిరునగవులు చిలుకంగ
నగరాజసుత చిరునగవులు చిలుకంగ
సిగలోన వగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ ..
ఆనంద తాండవ మాడే.. శివుడు
అనంతలయుడు.. చిదంబర నిలయుడు
ఆనంద తాండవమాడే..

చరణం 1:

ప్రణవనాదం ప్రాణం కాగా.. ప్రకృతిమూలం తానం కాగా
భువనములే రంగ భూమికలు కాగా
భుజంగ భూషణుడు.. అనంగ భీషణుడు
పరమ విభుడు.. గరళధరుడు
భావ రాగ తాళ మయుడు సదయుడు...

చరణం 2:

ఏమి శాంభవ లీల? ఏమా తాండవహేల?
ఏమి శాంభవ లీల? ఏమా తాండవహేల?
అణువణువులోన దివ్యానంద రసడోల
సుర గరుడులు.. ఖేచరులు.. విద్యాధరులు..ఊ..ఊ..
సుర గరుడులు.. ఖేచరులు.. విద్యాధరులు
నిటల తట ఘటిత..నిజకరకములై
నిలువగా.. పురహరాయని పిలువగా ..కొలువగా..
ఆనంద తాండవమాడే...

చరణం 3:

ధిమి ధిమి ధిమి ధిమ డమరుధ్వానము
దిక్తటముల మార్మోయగా...
కిణకిణ కిణ కిణ మణి నూపురముల ఝణత్కారములు మ్రోయగా..
విరించి తాళము వేయగా.. హరి మురజము మ్రోయింపగా
ప్రమధులాడగా... అప్సరలు పాడగా .. ఆడగా .. పాడగా...
ఆనంద తాండవమాడే ..

America Ammayi : Aame thoti maatundi Song Lyrics (ఆమె తోటి మాటు౦ది)

చిత్రం: అమెరికా అమ్మాయి (1976)

సాహిత్యం: మైలవరపు గోపి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: జి. కె. వెంకటేష్


పల్లవి : 

హే.. హే.. హే.. రూ.. రూ.. రూ.. రూ
ఆమె తోటి మాటు౦ది.. పెదవి దాటి రాకుంది
ఆమె తోటి మాటు౦ది.. పెదవి దాటి రాకుంది
ఏమున్నదో... ఆ చూపులో?

చరణం 1 :

చిరుగాలి తరగల్లె నడకలు నేర్పిందీ
సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీ
చిరుగాలి తరగల్లె నడకలు నేర్పిందీ
సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీ
నవ్వు నన్ను పిలిచిందీ.. కళ్ళతోటి కాదందీ
నవ్వు నన్ను పిలిచిందీ.. కళ్ళతోటి కాదందీ 
దట్స్ లవ్.. లవ్.. లవ్.. లవ్..లవ్
హే.. హే.. హే.. రూ.. రూ.. రూ.. రూ
ఆమె తోటి మాటు౦ది.. పెదవి దాటి రాకుంది
ఏమున్నదో... ఆ చూపులో?

చరణం 2 :

తనకైన లోలోన ఆశగ వుంటు౦దీ
పైపైకి నాపైన అలకలు పోతుంది
తనకైన లోలోన ఆశగ వుంటు౦దీ
పైపైకి నాపైన అలకలు పోతుంది
మనసు తెలుపనంటుందీ.. మమత దాచుకుంటుందీ
మనసు తెలుపనంటుందీ.. మమత దాచుకుంటుందీ
దట్స్ లవ్.. లవ్.. లవ్.. లవ్..లవ్
హే.. హే.. హే.. రూ.. రూ.. రూ.. రూ
ఆమె తోటి మాటు౦ది.. పెదవి దాటి రాకుంది
ఏమున్నదో... ఆ చూపులో? 


America Ammayi : Jilibila Siggula Song Lyrics (జిలిబిలి సిగ్గుల చిలకను)

చిత్రం: అమెరికా అమ్మాయి (1976)

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం

సంగీతం: జి. కె. వెంకటేష్



పల్లవి : 

జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగుల తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
ఓ... ఓ... ఓ.. బెదురుచు చేరెను చిలకమ్మా

చరణం 1 :

కొండల కోనల కోయిల పాడెను సంగీతం
కొండల కోనల కోయిల పాడెను సంగీతం
మధువులు ఆనుచు.. మత్తుగ పాడుచు.. తుమ్మెద ఆడేను సల్లాపం...
జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
బెదురుచు చేరెను చిలకమ్మా

చరణం 2 :

పచ్చని పసరిక పానుపు పరిచెను పోదరి౦ట్లో
పచ్చని పసరిక పానుపుపరిచెను పోదరి౦ట్లో
వెచ్చనివలపుల ముచ్చట తీరగ తనువులు కరిగెను కౌగిట్లో
ఓ.. ఓ.. జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా 
అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
బెదురుచు చేరెను చిలకమ్మా

America Ammayi : Tell me tell me Song Lyrics (ఓ టెల్ మి.. టెల్ మి.. )

చిత్రం: అమెరికా అమ్మాయి (1976)

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

సంగీతం: జి. కె. వెంకటేష్



పల్లవి : 

ఓ టెల్ మి.. టెల్ మి.. టెల్ మి.. వాట్
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి.. అఫ్ కోస్
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్ 
ఓ.. టెల్ మి.. టెల్ మి.. టెల్ మి.. అస్క్ మి బేబీ
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి..  సర్టె న్లీ స్వీట్ హార్ట్
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్

చరణం 1 :

చాటు చేయ వద్దు నీ అందాలు..
వేస్ట్ చేయ వద్దు నీ సరదాలు
చాటు చేయ వద్దు నీ అందాలు..
వేస్ట్ చేయ వద్దు నీ సరదాలు  
చేయి చేయి కలుపు.. నీ హయి ఏమొ తెలుపు..
నీ మానసంతా నా మీదే నిలుపు
కలసి చిందు లేద్దా౦.. కవ్వించి నవ్వుకుందా౦..
ఈ రేయి మనం ఒళ్ళు మరచిపోదాం
ఓ టెల్ మి.. టెల్ మి.. టెల్ మి.. ఊహు
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి.. నో
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్  బేబి.. కమాన్

చరణం 2 :

వేయలేవు గాలికేమొ సంకేళ్ళు.. 
ఆపలేవు పడుచుదనం పరువళ్ళు 
వేయలేవు గాలికేమొ సంకేళ్ళు.. 
ఆపలేవు పడుచుదనం పరువళ్ళు 
ఈ సిగ్గు నీకు వాద్దు.. అహ లేదు మనకు హద్దు..
ప్రతి వలపు జంట లోకానికి ముద్దు
ఈ వయసు మరల రాదు.. ఈ సుఖము తప్పుకాదు
ఈ సరదాలకు సరిసాటే లేదు.. 
ఓ.. టెల్ మి.. టెల్ మి.. టెల్ మి..
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి..  విత్ ప్లెషర్
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్
ఓ.. టెల్ మి.. టెల్ మి.. టెల్ మి..
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి..
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్




9, మార్చి 2024, శనివారం

America Ammayi : Oka Venuvu Song Lyrics (ఒక వేణువు వినిపించెను)

చిత్రం: అమెరికా అమ్మాయి (1976)

సాహిత్యం: మైలవరపు గోపి

గానం: జి. ఆనంద్

సంగీతం: జి. కె. వెంకటేష్



పల్లవి:

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
ఒక రాధిక అందించెను నవరాగ మాలికా
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా

చరణం: 1

సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
నవ మల్లిక చినవోయెను
నవ మల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా

చరణం: 2

వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ
వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ
రేరాణియె నా రాణికి
రేరాణియె నా రాణికి పారాణి పూసెను
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా

చరణం: 3

ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా
ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా
నా గుండెలొ వెలిగించెను
నా గుండెలొ వెలిగించెను సింగార దీపిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
ఒక రాధిక అందించెను నవరాగ మాలికా
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా


31, మార్చి 2022, గురువారం

America Ammayi : Paadana Tenugu Pata Song Lyrics

చిత్రం: అమెరికా అమ్మాయి (1976)

సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం: పి. సుశీల

సంగీతం: జి. కె. వెంకటేష్



పల్లవి:

పాడనా తెనుగుపాట... పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగుపాట...

చరణం 1:

కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో మావుల తోపుల మూపులపైన మసలే గాలుల గుసగుసలో మంచి ముత్యాలపేట మధురామృతాల తేట ఒకపాట... పాడనా తెనుగుపాట... పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగుపాట...

చరణం 2:

త్యాగయ క్షేత్రయ రామదాసులు త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివితీర వినిపించినది నాడునాడులుకదిలించేది వాడవాడలా కరిగించేది చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట ఒకపాట... పాడనా తెనుగుపాట... పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగుపాట...

చరణం 3:

ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ మెళ్ళో తాళి కాళ్లకు పారాణి మెరిసే కుంకుమబొట్టు ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడే తెలుగుతల్లి పెట్టనికోట తెలుగునాట ప్రతిచోట ఒకపాట... పాడనా తెనుగుపాట... పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగుపాట...