చిత్రం: గోవింద గోవింద (1994)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.యస్.చిత్ర
సంగీతం: రాజ్-కోటి
పల్లవి:
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె త్తొందర సందిట చేరా
మానస చోర మల్లెల వీరా మాటరా
మాప్పటి శూరా మన్మథ వీరా మోతరా..ఓ ..ఓ
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె త్తొందర సందిట చేరా
చరణం 1:
ఆరూ బయటా తక్ తక్ తకధిమి
కన్నె జారే పైటా ధిక్ తక్ తికధిన్
తాళాలూ తప్పెట్లూ ఆగాలిలే
పూల దుప్పట్లు చప్పట్లు మోగాలిలే
కౌగిట్లో కాలాలు కాగాలిలే
చిమ్మ చీకట్లో సిగ్గమ్మ కరగాలిలే
కొట్టినా తిట్టినా గుట్టుగా కట్టుకో కుర్రడో
కట్టీనా పట్టీనా ప్రేమగా తట్టుకో అమ్మడో
కొత్త నీ జోడుకి కొక్కరో కోడుకీ
పొత్తులే రద్దురా నన్ను లేపొద్దురా
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
చరణం 2:
వైశాఖంలో తత్ తత్ తరిగిట వచ్చీ ఆషాఢంలో ధిత్ తత్ తిరగిట కార్తీకంలో తత్ తత్ తరిగిట వస్తే హేమంతంలో ధిత్ తత్ తరిగిట నీ గుండే గుప్పిల్లు విప్పాలిలే ప్రేమ గుప్పంటు సందేల రేగాలిలే మంత్రాలు తంత్రాలు మానాలిలే ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలిలే తప్పులే ఒప్పులూ పెట్టకే తిప్పలు అమ్మడో గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడో అబ్బనీ పట్టులో కమ్మనీ హాయిరో చేతలే ముద్దులే మాటలింకొద్దులే ఇందిర మందిర సుందర కారా ఎందుక త్తొందర సందిట చేరా ఇందిర మందిర సుందర కారా అందుకె త్తొందర సందిట చేరా మానస చోర మల్లెల వీరా మాటరా మాప్పటి శూరా మన్మథ వీరా మోతరా..ఓ ..ఓ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి