25, మార్చి 2022, శుక్రవారం

Donga Ramudu : Anuragamu Virisena Song Lyrics (అనురాగము విరిసేనా)

చిత్రం : దొంగ రాముడు(1955)

గాయని : పి. సుశీల

రచయిత : సముద్రాల రాఘవాచార్య

సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు



అనురాగము విరిసేనా ఓ రేరాజా అనుతాపము తీరేనా వినువీధి నేలే రాజువే నిరుపేద చెలిపై మనసవునా అనురాగము విరిసేనా ఓ రేరాజా అనుతాపము తీరేనా నిలిచేవు మొయిలు మాటున పిలిచేవు కనుల గీటున నిలిచేవు మొయిలు మాటున పిలిచేవు కనుల గీటున పులకించు నాది డెందము ఏనాటి ప్రేమా బంధమో ఓ రేరాజా.. అనురాగము విరిసేనా మును సాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో మును సాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో నీ మనసేమో తేటగా తెనిగించవయా మహారాజా ఓ రేరాజా.. అనురాగము విరిసేనా వినువీధి నేలే రాజువే నిరుపేద చెలిపై మనసవునా అనురాగము విరిసేనా !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి