Donga Ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Donga Ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2024, శనివారం

Donga Ramudu : Anda Chandala Song Lyrics (అంద చందాల సొగసరివాడు )

చిత్రం : దొంగ రాముడు(1955)

గాయని : జిక్కి

రచయిత : సముద్రాల రాఘవాచార్య

సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు



పల్లవి :

అంద చందాల సొగసరివాడు (2) విందు భోంచేయి వస్తాడు నేడు చందమామ... ఓహో చందమామ చందమామ ఓహో చందమామ ఓ ఓ ఓ... చరణం : 1

ఓ ఓ ఓ... చూడచూడంగ మనసగువాడు ఈడు జోడైన వలపుల రేడు ఊఁ... వాడు నీకన్నా సోకైన వాడు విందు భోంచేయి వస్తాడు నేడు

చందమామ... ఓహో చందమామ చందమామ ఓహో చందమామ ఓ ఓ ఓ... చరణం : 2

ఓ ఓ ఓ... వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు వాని నవ్వుల్లో ముత్యాలు రాలు ఊఁ... వాడు నీకన్నా చల్లని వాడు విందు భోంచేయి వస్తాడు నేడు

చందమామ... ఓహో చందమామ చందమామ ఓహో చందమామ ఓ ఓ ఓ... చరణం : 3

ఓ ఓ ఓ.. నేటి పోటీల గడుసరివాడు మాట పాటించు మగసిరివాడు ఊఁ... వాడు నీకన్నా సిరిగిలవాడు విందు భోంచేయి వస్తాడు నేడు

చందమామ... ఓహో చందమామ చందమామ ఓహో చందమామ ఓ ఓ ఓ...

Donga Ramudu : Bhale Tata Mana Bapuji Song Lyrics (భలే తాత మన బాపూజీ)

చిత్రం : దొంగ రాముడు(1955)

గాయని : పి. సుశీల

రచయిత : సముద్రాల రాఘవాచార్య

సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు



పల్లవి: భలే తాత మన బాపూజీ బాలల తాతా బాపూజీ బోసినవ్వుల బాపూజీ చిన్నీ పిలక బాపూజీ భలే తాత మన బాపూజీ బాలల తాతా బాపూజీ చరణం 1: కుల మత భేదం వలదన్నాడు కలిసి బతికితే బలమన్నాడు మానవులంతా ఒకటన్నాడు మనలో జీవం పోశాడు చరణం 2: నడుం బిగించి లేచాడు అడుగూ ముందుకు వేశాడు కదం తొక్కుతూ పదం పాడుతూ దేశం దేశం కదిలింది గజగజలాడెను సామ్రాజ్యం మనకు లభించెను స్వారాజ్యం మనకు లభించెను స్వారాజ్యం చరణం 3: సత్యాహింసలే శాంతి మార్గమని జగతికి జ్యోతిని చూపించాడు మానవ ధర్మం బోధించాడు ఆ ఆ ఆ ఆ ఆ ఆ మానవ ధర్మం బోధించాడు మహాత్ముడై ఇల వెలిశాడు

Donga Ramudu : Ravoyi Maa Intiki Song Lyrics (రారోయి మా ఇంటికి)

చిత్రం : దొంగ రాముడు(1955)

గాయని : ఆర్. నాగేశ్వరరావు, జిక్కి

రచయిత : సముద్రాల రాఘవాచార్య

సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు



పల్లవి:  రారోయి మా ఇంటికి ... "మ్మ్"  రారోయి మా ఇంటికి మావో  మాటున్నది మంచి మాటున్నది... "హాహ్హా"  మాటున్నది మంచి మాటున్నది ... "ఆఁ"  చరణం 1:  నువ్వు నిలిసుంటె నిమ్మ సెట్టు నీడున్నది... "ఆహా"  నువ్వు కూసుంటె కురిసీలో పీటున్నది ... "ఆహా"  నువ్వు తొంగుంటె పట్టె మంచం పరుపున్నది ...."అహ్హహ్హహ్హ .. భలే భలే"....  మాటున్నది మంచి మాటున్నది  రారోయి మా ఇంటికి ... "మ్మ్"...  మావో మాటున్నది మంచి మాటున్నది  చరణం 2:  ఆకలైతే సన్నబియ్యం కూడున్నది .. "మ్మ్"  నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది .. "బావుంది బావుంది"  అందులోకి అరకోడి కూరున్నది .. "అహహ్హ అవ్వల్రైట్ యెర్రీ గుడ్"  అందులోకి అరకోడి కూరున్నది... "ఆఁ"  ఆపైన రొయ్యప్పొట్టు చారున్నది ... "అహహ్హా.. అబ్బో అబ్బో"  మాటున్నది మంచి మాటున్నది  రారోయి మా ఇంటికి ... "అంతేగా"...  మావో మాటున్నది మంచి మాటున్నది  చరణం 3:  రంజైన మీగడ పెరుగున్నది .... "బుర్ వీ... చీ చీ చీ చీ"  నంజుకొను ఆవకాయ ముక్కున్నది ... "ఆహ్.. డోంట్ వాంట్"  రోగమొస్తె ఘాటైన మందున్నది .. "అహ్.. అహహ అహ్హ"  రోగమొస్తె ఘాటైన మందున్నది .. "ఆ"  నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది ... "అహ్హహహహహహ ఊ ఓహొహొహొహొ"

Donga Ramudu : Chigurakulalo Chilakamma Song Lyrics (ఓ.ఓ చిగురాకులలో చిలకమ్మా)

చిత్రం : దొంగ రాముడు(1955)

గాయని : ఘంటసాల, జిక్కి

రచయిత : సముద్రాల రాఘవాచార్య

సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు


పల్లవి:

ఓ.ఓ చిగురాకులలో చిలకమ్మా ... చిన్నమాట వినరావమ్మా ఓ.ఓ మరుమల్లెలలో మావయ్య... మంచి మాట సెలవీవయ్యా పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ.ఓ ఓ ... ఓ చిగురాకులలో చిలకమ్మా ...

చరణం:1   

ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసీ పలికిన విలువేల ఆ ... ఆ ఓ . ఓఓ ఓ... ఓ మరుమల్లెలలో మావయ్యా...

చరణం:2

వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయ్యదనాలకు కలవా విలువలు సెలవీయ ఆ ... ఆ ఓ . ఓఓ ఓఓ ఓఓ…

25, మార్చి 2022, శుక్రవారం

Donga Ramudu : Anuragamu Virisena Song Lyrics (అనురాగము విరిసేనా)

చిత్రం : దొంగ రాముడు(1955)

గాయని : పి. సుశీల

రచయిత : సముద్రాల రాఘవాచార్య

సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు



అనురాగము విరిసేనా ఓ రేరాజా అనుతాపము తీరేనా వినువీధి నేలే రాజువే నిరుపేద చెలిపై మనసవునా అనురాగము విరిసేనా ఓ రేరాజా అనుతాపము తీరేనా నిలిచేవు మొయిలు మాటున పిలిచేవు కనుల గీటున నిలిచేవు మొయిలు మాటున పిలిచేవు కనుల గీటున పులకించు నాది డెందము ఏనాటి ప్రేమా బంధమో ఓ రేరాజా.. అనురాగము విరిసేనా మును సాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో మును సాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో నీ మనసేమో తేటగా తెనిగించవయా మహారాజా ఓ రేరాజా.. అనురాగము విరిసేనా వినువీధి నేలే రాజువే నిరుపేద చెలిపై మనసవునా అనురాగము విరిసేనా !!