5, మార్చి 2022, శనివారం

Gorintaku : Komma Kommako Sannayi Song Lyrics (కొమ్మ కొమ్మకో సన్నాయి)

చిత్రం: గోరింటాకు (1979)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: కే.వీ.మహదేవన్


పల్లవి:

కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం

చరణం 1:

మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతను చూడు పరుచుకున్న మమతను చూడు పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బును చూడు అందుకే ధ్యానం అందుకే మౌనం కొమ్మ కొమ్మకో సన్నాయి.......

చరణం 2:

కొంటె వయసు కోరికలాగ గోదారి ఉరకలు చూడు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు కొంటె వయసు కోరికలాగ గోదారి ఉరకలు చూడు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు ఒడ్డుతోనూ...నీటితోనూ పడవ ముడి పడి వుండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి