చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
పల్లవి:
ఓహొ ఓహొ నిన్నే కోరెగా కుహుకుహూ అని కోయిలా
ఓహొ ఓహొ నిన్నే కోరెగా కుహుకుహూ అని కోయిలా వసంతవేళలా పసందు మీరగా అపూర్వగానమే ఆలపించే తీయగా
ఓహొ ఓహొ నిన్నే కోరెగా కుహుకుహూ అని కోయిలా
చరణం 1
అదా కోరికా వయ్యారి కోయిలా జగాలే నీ చూపులో జలదిరించెనే అదా కోరికా వయ్యారి కోయిలా జగాలే నీ చూపులో జలదిరించెనే వరాల నవ్వులే గులాబి పువ్వులై వలపు తేనె నాలోన చిలకరించెనే
ఓహొ ఓహొ నిన్నే కోరెగా కుహుకుహూ అని కోయిలా చరణం 2:
ఫలించె నేను కన్న కలలు తీయతీయగా సుఖాలలో శోలిపో హాయి హాయిగా ఫలించె నేను కన్న కలలు తీయతీయగా సుఖాలలో శోలిపో హాయి హాయిగా ఉయ్యాలలూగే నామది చిటారుకొమ్మలా నివాళి అందుకో ఈవేళ పండుగా సదా సుధా తరంగాల తేలిపోదమా ఓహొ ఓహొ నిన్నే కోరితి కుహుకుహు అనీ పాడితి ఆ హా హా . . .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి