చిత్రం: సత్తెకాలపు సత్తెయ్య (1969)
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
పల్లవి:
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
చరణం 1:
ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో సిగ్గులన్ని దోచుకుంటే తొలివలపే ఎంతో హాయి ఆ మగసిరి అల్లరి అంతా నాకోసం దాచినదేమో ఆ మగసిరి అల్లరి అంతా నాకోసం దాచినదేమో అందగాడు ఆశపెట్టే సయ్యాటలు ఎంతో హాయి నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
చరణం 2:
ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో మల్లెలాగ నేను కూడా జడలోనే ఉంటే హాయి ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో కాంతిలాగ నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి