చిత్రం : మహాత్మా(2001)
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : విజయ్ ఆంటోనీ
పల్లవి:
రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్
కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ
కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
చరణం 1:
రామనామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత...
కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి యని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత
ఈ బోసి నోటి తాతా...
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ...
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి...
సత్యాహింసల మార్గజ్యోతి.. నవశకానికే నాంది..
రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్
చరణం 2:
గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత.. సిసలైన జగజ్జేత... చరకాయంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి.. నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత... సంకల్ప బలం చేత... సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చుపిన క్రాంతి తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావన మూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి.. ఇలాంటి నరుడొకడిలాతలంపై నడియాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకముందే ముందుతరాలకి చెప్పండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి