చిత్రం: మంగమ్మ శపథం (1965)
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల
సంగీతం: టి.వి. రాజు
రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది👏👏 పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ.. రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ.. రివ్వున సాగే !! పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది కోడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది (2) సొగసైనా బిగువైనా నాదే నాదే రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది👏👏 పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ.. రివ్వున సాగే.. నా పరువం సెలయేరుల నడకలవలె ఉన్నది నా రూపం విరజాజుల నవ్వులవలె ఉన్నది (2) జగమంతా అగుపించగ నేనే నేనే రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది👏👏 పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ.. రివ్వున సాగే.. నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా తారలనే దూసి దూసి దండలుగా చేతునా (2) నేనన్నది కాలేనిది ఏది ఏది రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది👏👏 పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ.. రివ్వున సాగే..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి