చిత్రం: మంగమ్మ శపథం (1965)
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల,పి.సుశీల
సంగీతం: టి.వి. రాజు
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
చెలి... నా చెంత నీకింత జాగేలనే
చెలి... నా చెంత నీకింత జాగేలనే
కనులీవేళ చిలిపిగ నవ్వెను.
మనసేవేవో వలపులు రువ్వెను.
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
మధుర శృంగార మందార మాల. కదలి రావేల కలహంస లీల
మధుర శృంగార మందార మాల. కదలి రావేల కలహంస లీల
రంగు రంగుల బంగారు చిలకా...
రంగు రంగుల బంగారు చిలక... వలచి నీ ముందు వాలిందిలే.ఏ ఏ...
కనులీవేళ చిలిపిగ నవ్వెను... మనసేవేవో వలపులు రువ్వెను
చెలి... నా చెంత నీకింత జాగేలనే
చెలి... నా చెంత నీకింత జాగేలనే
చరణ మంజీర నాదాలలోన. కరగి పోనిమ్ము గంధర్వ బాలా
చరణ మంజీర నాదాలలోన. కరగి పోనిమ్ము గంధర్వ బాలా
సడలి పోవని సంకెళ్ళు వేసీ...
సడలి పోవని సంకెళ్ళు వేసి. సరస రాగాల తేలింతులే. ఏ ఏ...
కనులీవేళ చిలిపిగ నవ్వెను. మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాల లూగింతులే... ఇక అందాల ఉయ్యాల లూగింతులే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి