చిత్రం: మంగమ్మ శపథం (1965)
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల,పి.సుశీల
సంగీతం: టి.వి. రాజు
ఓ..... ఓ.... ఓ.... ఒయ్యారమొలికే చిన్నది ఉడికించుచున్నది రమ్మంటె రానుపొమ్మన్నది అ.... అ.... అ.... సయ్యాటలాడే ఓ దొర సరసాలు మానరా కవ్వింతలేల ఇక చాలురా ఇంతలోనే ఏ వింత నీలో అంత తొందర కలిగించెను చెంత నిలిచిన చిన్నారి చూపే అంతగా నను కవ్వించెను మనసే చెలించెను అనురాగవీణ పలికించెను అ.... అ.... అ.... సయ్యాటలాడే ఓ దొర సరసాలు మానరా కవ్వింతలేలా ఇక చాలురా హొయలు చిలికే నీకళ్ళ లోని ఓర చూపులు ఏమన్నవి నగవు లొలికే నా రాజులోని సొగసులన్నీ నావన్నవి తలపే ఫలించెను తొలి ప్రేమ నేడు చిగురించెను ఓ.... ఓ.... ఓ.... వయ్యారమొలికే చిన్నది ఉడికించుచున్నది రమ్మంటె రానుపొమ్మన్నది