చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి రచన: దాశరథి కృష్ణమాచార్య గానం: ఘంటసాల బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు ఒక్క బాటపై కలసి నడిచారు వారు అన్నంటే తమ్ములకు అనురాగమే అన్నకు తమ్ములంటే అనుబంధమే చల్లని తల్లి ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచేను పిల్లలకు పెద్దలకు తల్లివంటిది ఆ ఇల్లు ఆమెతో స్వర్గమైనది అన్న మనసులో ఉన్నవి ఎన్నో కోరికలు తమ్ములకు జరగాలి పెళ్ళీపేరంటాలు పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలి కలకాలం ఈలాగే కలసివుండాలి బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం కన్నకలలు అన్ని కూడ కల్లలాయెనే అన్నదమ్ములొకటనుట అడియాశే ఆయెనే గూటిలోని ఆ గువ్వలు ఎగిరిపోయెనే స్వర్గమంటి ఇల్లంతా నరకంగా మారెనే ఆకలిని ఆవలిని కథగా మారే కలతే మిగిలే ఈనాడు ఏనాటికి ఏమౌనో ఎవరికి తెలుసు? విధి రాసిన రాతకు తిరుగే లేదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి