చిత్రం: ప్రియరాగాలు (1997)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి :
చినుకు తడి స్పృశించే నేలలా చిలిపి చలి సృజించే జ్వాలలా మధు మురళి రమించే గాలిలా మొదటి విరి సుమించే వేళలా మోయలేని హాయిలో మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా ॥చినుకు తడి॥ చరణం 1:
కనబడకుంటే ఓ క్షణమైనా కునుకుండదే ఎదురుగ ఉంటే నామదిలోనా కుదురుండదే చూస్తూనే ఉండాలి నిన్ను కనుమూసి ఉన్నా రెప్పల్లో కట్టేయి నన్ను కాదందునా నిదరేదో నిజమేదో తేలీ తేలని లాలనలో మౌనరాగం మధుపరాగం సాగనేలా చినుకు తడి స్పృశించే నేలలా చిలిపి చలి సృజించే జ్వాలలా మధు మురళి రమించే గాలిలా మొదటి విరి సుమించే వేళలా చరణం 2:
ప్రతినడిరాత్రి సూర్యుడురాడా నీ శ్వాసతో జతపడగానే చంద్రుడుకాడా నీ సేవతో ఆవిర్లు చిమ్మిందే చూడు పొగమంచు పాపం వేడెక్కే చల్లారుతుంది కలిపేక్షణం పగలేదో రేయేదో తెలిసీ తెలియని లాహిరిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా చినుకు తడి స్పృశించే నేలలా చిలిపి చలి సృజించే జ్వాలలా మధు మురళి రమించే గాలిలా మొదటి విరి సుమించే వేళలా మోయలేని హాయిలో మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి