Priyaragalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Priyaragalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మార్చి 2022, శనివారం

Priyaragalu : Koonalamma Koonalamma Song

చిత్రం: ప్రియరాగాలు (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా తేనెబొమ్మ తేనెబొమ్మా తీపి పెదవి అందనీమ్మా ఎద కుంపటిలో వెన్నెల రాజేసీ కోరికతో వయసు ఉడికిపోతుంటే చెక్కిలి అద్దమా తడి ముద్దుకు సిద్ధమా ఏమ్మా.. ఏమో.. రామ్మా.. వామ్మో తుంటరి నేస్తమా అంత అల్లరి ఆత్రమా ఆశా.. ఏమో.. చూశా .. వామ్మో నడుమెక్కి ఆడేటి జడనిక్కు చూస్తుంటే నిలువెల్ల చలిపుట్టే చిలకమ్మా ఈడు చెలరేగిపొతుంది చూడమ్మా వద్దొద్దు అంటున్న ఉత్తుత్తి సిగ్గుల్ని వాటంగా దాటేసి రారాదా వచ్చి దర్జాగ దోచేసి పోరాదా అంటూ ఎద కుంపటిలో వెన్నెల రాజేసీ కోరికతో వయసు ఉడికిపోతుంటే వద్దకు చేరనా వేడి ముద్దులు కోరనా రానా.. పోనా... వద్దని ఆపినా వదలొద్దని ఆగినా తగువే.. ఓహొ.. తగునా..ఆహా మనసైన నీతోనే మనువైన నీతోనే నా మాట నమ్మవే ఓ మైనా నిన్ను విడిచుండలేనింక ఏమైనా పులకింత పూవాన చిలికించు నీతోని ముడివేసుకుంటాను నీ పైనా నీకు ఇస్తాను అడిగింది ఏదైనా అంటూ ఎద కుంపటిలో వెన్నెల రాజేసీ కోరికతో వయసు ఉడికిపోతుంటే కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా

Priyaragalu : Chinuku Tadi Song Lyrics

చిత్రం: ప్రియరాగాలు (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి :

చినుకు తడి స్పృశించే నేలలా చిలిపి చలి సృజించే జ్వాలలా మధు మురళి రమించే గాలిలా మొదటి విరి సుమించే వేళలా మోయలేని హాయిలో మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా ॥చినుకు తడి॥ చరణం 1:

కనబడకుంటే ఓ క్షణమైనా కునుకుండదే ఎదురుగ ఉంటే నామదిలోనా కుదురుండదే చూస్తూనే ఉండాలి నిన్ను కనుమూసి ఉన్నా రెప్పల్లో కట్టేయి నన్ను కాదందునా నిదరేదో నిజమేదో తేలీ తేలని లాలనలో మౌనరాగం మధుపరాగం సాగనేలా చినుకు తడి స్పృశించే నేలలా చిలిపి చలి సృజించే జ్వాలలా మధు మురళి రమించే గాలిలా మొదటి విరి సుమించే వేళలా చరణం 2:

ప్రతినడిరాత్రి సూర్యుడురాడా నీ శ్వాసతో జతపడగానే చంద్రుడుకాడా నీ సేవతో ఆవిర్లు చిమ్మిందే చూడు పొగమంచు పాపం వేడెక్కే చల్లారుతుంది కలిపేక్షణం పగలేదో రేయేదో తెలిసీ తెలియని లాహిరిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా చినుకు తడి స్పృశించే నేలలా చిలిపి చలి సృజించే జ్వాలలా మధు మురళి రమించే గాలిలా మొదటి విరి సుమించే వేళలా మోయలేని హాయిలో మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా

Priyaragalu : Raayabaaram Pampindevare Song

చిత్రం: ప్రియరాగాలు (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



రాయబారం పంపిందెవరే రాత్రి వేళల్లో ప్రేమ జంటను కలిపిందెవరే పూల తోటల్లో ఆ...ఆ... రాయబారం పంపిందెవరే రాత్రి వేళల్లో ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో కోకిలమ్మను కూయమంటూ మల్లెవీణను మీటమంటూ కల్యాణ రాగాల వర్ణాలతో నీ పాట తేట తేట తెనుగు పాట చల్లలమ్మ చద్ది మూట అన్నమయ్య కీర్తనల ఆనందకేళిలా నీ పాట గడుసుపిల్ల జారుపైట గండుమల్లె పూలతోట పల్లెటూరి బృందావనాల సారంగ లీలలా చిరుమబ్బుల దుప్పటిలా ముసుగెత్తిన జాబిలిలా నునువెచ్చని కోరికనే మనువాడని చల్లని వెన్నెలలా కోడి కూసే వేళ దాకా ఉండిపోతే మేలు అంటూ గారాలు బేరాలు కానిమ్మంటూ రాయబారం పంపిందెవరమ్మా రాత్రివేళల్లో ప్రేమజంటను కలిపిందెవరే పూలతోటల్లో ఉయ్యాల ఊపి చూడు సందేవేళా పిల్లగాలి శోభనాల కొండ నుంచి కోన ఒడికి జారేటి వాగులా జంపాల జామురాతిరైనవేళా జాజిపూల జవ్వనాల జంటకోరి జాణ పాడే జావళీ పాటలా గోపెమ్మలు కలలు కనే గోవిందుని అందములా రేపల్లెకి ఊపిరిగా రవళించిన వేణువు చందములా హాయిరాగం తీయమంటూ మాయచేసి వెళ్లమంటూ రాగాలు తానాలు కానిమ్మంటూ రాయబారం పంపిందెవరమ్మా రాత్రిరేళల్లో ప్రేమజంటను కలిపిందెవరే పూలతోటల్లో

Priyaragalu : Priya Vasanta Geetama Song Lyrics

చిత్రం: ప్రియరాగాలు (1997)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం:ఎం. ఎం. కీరవాణి, కె.యస్.చిత్ర

ప్రియవసంతగీతమా వనమయూరనాట్యమా కుహుకుహూలరాగమా మృదుస్వరాలనాదమా అరవిందాలయాన పరచుకున్న శాంతమా పెదవులు మూగబాసలెరిగిన ఏకాంతమా అందుతున్న అందమా పొందికైన బంధమా శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా చిలిపిఊహ వెనుక తరుముతుంటే ఆకాశ వీధి స్వాగతించెలే వలపుయాత్ర సాగిపోతువుంటే మేఘాలవాడ విడిది చూపెలే సుదూర స్వప్నసీమ సమీపమే సుమా జపించి జంటప్రేమ జయించి చేరుమా పరవశమా పరుగిడుమా ఉక్కబోసే వేళలో ఊటి చలో చలో ఎండకౌగిలి చేరినా అమ్మో అదేం చలో ఇలాంటి హాయి నాకు ఇంతవరకు లేదుగా ఈ వేళ అందులోన వింత చూడు కొత్తగా చేయిచాచి చేరదీసి చూపవమ్మా శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా

1, ఆగస్టు 2021, ఆదివారం

Priyaragalu : Chinna Chiru Chiru song Lyrics (చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా)

చిత్రం: ప్రియరాగాలు (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

గానం: కె.యస్.చిత్ర


చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోతపోసి కన్నానురా నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా నీలో ఉన్నా.. నీతో ఉన్నా.. చిన్నా... అటు చూడు అందాల రామచిలకనీ చూస్తోంది నిన్నేదో అడుగుదామనీ నీ పలుకు తనకి నేర్పవా అనీ ఇటు చూడు చిన్నారి లేడిపిల్లనీ పడుతోంది లేస్తొంది ఎందుకోమరీ నీలాగ పరుగు చూపుదామనీ కరిగిపోని నా తీపి కలలనీ తిరిగిరాని నా చిన్నతనమునీ నీ రూపంలో చూస్తూ ఉన్నా చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా తూనీగ నీలాగ ఎగరలేదురా ఆ తువ్వాయి నీలాగ గెంతలేదురా ఈ పరుగు ఇంక ఎంతసేపురా ఈ ఆట ఈ పూట ఇంక చాలురా నా గారాల మారాజ కాస్త ఆగరా నీ వెంట నేను సాగలేనురా ఎంతవెతికినా దొరకనంతగా ఎంత పిలిచినా పలకనంతగా వెళ్ళిపోకమ్మా..రారా కన్నా చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోతపోసి కన్నానురా నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా నీలో ఉన్నా.. నీతో ఉన్నా..