19, మార్చి 2022, శనివారం

Priyaragalu : Raayabaaram Pampindevare Song

చిత్రం: ప్రియరాగాలు (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



రాయబారం పంపిందెవరే రాత్రి వేళల్లో ప్రేమ జంటను కలిపిందెవరే పూల తోటల్లో ఆ...ఆ... రాయబారం పంపిందెవరే రాత్రి వేళల్లో ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో కోకిలమ్మను కూయమంటూ మల్లెవీణను మీటమంటూ కల్యాణ రాగాల వర్ణాలతో నీ పాట తేట తేట తెనుగు పాట చల్లలమ్మ చద్ది మూట అన్నమయ్య కీర్తనల ఆనందకేళిలా నీ పాట గడుసుపిల్ల జారుపైట గండుమల్లె పూలతోట పల్లెటూరి బృందావనాల సారంగ లీలలా చిరుమబ్బుల దుప్పటిలా ముసుగెత్తిన జాబిలిలా నునువెచ్చని కోరికనే మనువాడని చల్లని వెన్నెలలా కోడి కూసే వేళ దాకా ఉండిపోతే మేలు అంటూ గారాలు బేరాలు కానిమ్మంటూ రాయబారం పంపిందెవరమ్మా రాత్రివేళల్లో ప్రేమజంటను కలిపిందెవరే పూలతోటల్లో ఉయ్యాల ఊపి చూడు సందేవేళా పిల్లగాలి శోభనాల కొండ నుంచి కోన ఒడికి జారేటి వాగులా జంపాల జామురాతిరైనవేళా జాజిపూల జవ్వనాల జంటకోరి జాణ పాడే జావళీ పాటలా గోపెమ్మలు కలలు కనే గోవిందుని అందములా రేపల్లెకి ఊపిరిగా రవళించిన వేణువు చందములా హాయిరాగం తీయమంటూ మాయచేసి వెళ్లమంటూ రాగాలు తానాలు కానిమ్మంటూ రాయబారం పంపిందెవరమ్మా రాత్రిరేళల్లో ప్రేమజంటను కలిపిందెవరే పూలతోటల్లో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి