చిత్రం: ప్రియరాగాలు (1997)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం:ఎం. ఎం. కీరవాణి, కె.యస్.చిత్ర
ప్రియవసంతగీతమా వనమయూరనాట్యమా
కుహుకుహూలరాగమా మృదుస్వరాలనాదమా
అరవిందాలయాన పరచుకున్న శాంతమా
పెదవులు మూగబాసలెరిగిన ఏకాంతమా
అందుతున్న అందమా పొందికైన బంధమా
శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా
చిలిపిఊహ వెనుక తరుముతుంటే ఆకాశ వీధి స్వాగతించెలే
వలపుయాత్ర సాగిపోతువుంటే మేఘాలవాడ విడిది చూపెలే
సుదూర స్వప్నసీమ సమీపమే సుమా
జపించి జంటప్రేమ జయించి చేరుమా
పరవశమా పరుగిడుమా
ఉక్కబోసే వేళలో ఊటి చలో చలో
ఎండకౌగిలి చేరినా అమ్మో అదేం చలో
ఇలాంటి హాయి నాకు ఇంతవరకు లేదుగా
ఈ వేళ అందులోన వింత చూడు కొత్తగా
చేయిచాచి చేరదీసి చూపవమ్మా
శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి