23, మార్చి 2022, బుధవారం

Subhalagnam : Chinuku Chinuku Andelatho Song Lyrics (చినుకు చినుకు అందెలతో)

చిత్రం: శుభలగ్నం (1994)

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి: చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చరణం:1 నింగి నేల ఈవేళ చలికి వణికిపోతుంటే బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసే ఏలో అరె పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వల వేయక సెలయేరై పెనవేసింది అరె చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో తలపు తొలివలపు ఇక తకజం తకజం వయసు తడి సొగసు అరవిరిసే సమయం ఆహా......... ఊహూ...... ఓహోహోహో......... చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చరణం:2 మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది యద లోపల చలిగాలుల సుడి రేగింది వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసోచ్చే ఏలో మేను చూపు పోయింది వాలు చూపు సయ్యంది చలి కోరిక అలవోకగా తల ఊపింది అరె సరసాల సిందులోన ఏలో సరిగంగ తానాలు ఏలో ఒడిలో ఇక ఒకటై తకతకతై అంటే సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే ఆహా......... ఊహూ...... ఓహోహోహో......... చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి