24, ఏప్రిల్ 2022, ఆదివారం

Allari Premikudu : Chilip Chilaka Song Lyrics (చిలిపి చిలక )

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి :

చిలిపి చిలక I Love You అన్న వేళలో కలికి చిలక కవ్వింతల తోరణాలలో చిలకపచ్చ పైటకి కోకిలమ్మ పాటకి రేపోమాపో కమ్మని శోభనం

చరణం 1 :

సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక కలిగే వయ్యారాల ఒంపు కబురు పంపు గుబులు చంపు వల్లంకి రెక్కల్లో ఒళ్ళారబోసాక వయసు గోదాట్లోకి దింపు మరుల గుంపు మగువ తెంపు అహో ప్రియా మహోదయా లయ దయ लगाओ సుహాసిని సుభాషిణి చెలి సఖి चलाओ ఈ వసంత పూల వరదలా నన్ను అల్లుకోవె తీగ మరదలా నూజివీడు మావిడో మోజుపడ్డ కాముడో ఇచ్చాడమ్మా తీయని జీవితం

చరణం 2 :

నీలాలమబ్బుల్లొ నీళ్ళోసుకున్నాక మెరిసింది రేచుక్క రూపు కలల కాపు కనుల కైపు పున్నాల ఎన్నెల్లో పూవెట్టి పోయాక తెలిసింది పిల్లాడి ఊపు చిలిపి చూపు వలపు రేపు వరూధిని సరోజిని ఎదే కులు మనాలి ప్రియ ప్రియ హిమాలయ వరించుకోమనాలి కోనసీమ కోకమడతలా చిగురాకు రైక ఎత్తు పొడుపులా కొత్తపల్లి కొబ్బరో కొంగుపల్లి జబ్బరో నచ్చిందమ్మా అమ్మడి వాలకం




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి