Allari premikudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Allari premikudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఏప్రిల్ 2022, ఆదివారం

Allari Premikudu : Chilip Chilaka Song Lyrics (చిలిపి చిలక )

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి :

చిలిపి చిలక I Love You అన్న వేళలో కలికి చిలక కవ్వింతల తోరణాలలో చిలకపచ్చ పైటకి కోకిలమ్మ పాటకి రేపోమాపో కమ్మని శోభనం

చరణం 1 :

సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక కలిగే వయ్యారాల ఒంపు కబురు పంపు గుబులు చంపు వల్లంకి రెక్కల్లో ఒళ్ళారబోసాక వయసు గోదాట్లోకి దింపు మరుల గుంపు మగువ తెంపు అహో ప్రియా మహోదయా లయ దయ लगाओ సుహాసిని సుభాషిణి చెలి సఖి चलाओ ఈ వసంత పూల వరదలా నన్ను అల్లుకోవె తీగ మరదలా నూజివీడు మావిడో మోజుపడ్డ కాముడో ఇచ్చాడమ్మా తీయని జీవితం

చరణం 2 :

నీలాలమబ్బుల్లొ నీళ్ళోసుకున్నాక మెరిసింది రేచుక్క రూపు కలల కాపు కనుల కైపు పున్నాల ఎన్నెల్లో పూవెట్టి పోయాక తెలిసింది పిల్లాడి ఊపు చిలిపి చూపు వలపు రేపు వరూధిని సరోజిని ఎదే కులు మనాలి ప్రియ ప్రియ హిమాలయ వరించుకోమనాలి కోనసీమ కోకమడతలా చిగురాకు రైక ఎత్తు పొడుపులా కొత్తపల్లి కొబ్బరో కొంగుపల్లి జబ్బరో నచ్చిందమ్మా అమ్మడి వాలకం




Allari Premikudu : Naari Jana Priyatama Song Lyrics (నారీజన ప్రియతమా ప్రియతమా ప్రియతమా)

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)

సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :

నారీజన ప్రియతమా ప్రియతమా ప్రియతమా Hats Off నీకు Hats Off మూడొచ్చిన ముద్దుగుమ్మ మురిపెమా అనుపమ Hats Off నీకు Hats Off Dinner ఏం చేద్దాము? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు రాత్రికి ఏం ప్రోగ్రాము? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు ఊపిరాడనివ్వకుండా ఊపి ఊపి చంపుతోంది ఏమిటి ఈ బుచ్చుకు బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు

చరణం 1 :

పువ్వంటి చిన్నదాన కవ్వించు కళ్ళదానా పుట్టించినాడు నాకై ఆ బ్రహ్మ లవ్వంటూ చేసుకుంటే లైఫంటు పంచుకుంటే నీతోటి కాక నాకు ఎవరమ్మా? వయ్యారి వన్నెకాడ తయ్యారుగుందిలేరా ఉయ్యాల జంపాల రసగుల్లా కయ్యాలు పెట్టుకున్నా వియ్యాలు అందుకున్నా చుక్కల్ల వేళ దాకా ఆగాలా చెక్కిలి ఎప్పుడిస్తావు? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు చెంగున ఏందాచావు? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు ఊరుకున్న కుర్రగాణ్ణి ఊరించి చంపుతావు ఎక్కడ నీ బుచ్చుకు బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు

చరణం 2 :

సంపంగి తోట కాడ సన్నాయి ఊదుకోరా వలపు సై అన్న వెర్రి వేళా లగ్గాలు పెట్టకుండ ముగ్గేసి చూసుకోరా సిగ్గమ్మ చిన్నారి ముంగిళ్ల మందార తోట కాడ అందాలు ఆరబోసి విందారగించమన్న నెరజాణ చెంగావి చీర పైన చేమంతి పూలవాన తపన చల్లారిపోయేనా పండగకేం తెస్తావు? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు పెదవికి ఏం ఇస్తావు? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు పొద్దుగూకగానే తీపి తిక్కరేపుతుంది అసలేమిటి ఈ బుచ్చుకు బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు

30, జులై 2021, శుక్రవారం

Allari Premikudu : Ku Ku Ku Komma Song Lyrics (కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ)

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి: కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు.... కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు నిదురించే ఎదవీణ కడిలే వేళలో... మామిడి పూతల మన్మధ కోయిల... కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు.... చరణం 1: స్వరాలే...వలపు వరాలై...చిలిపి శరాలై...పెదవి కాటేయగా.. చలించే... స్వరాలే వలచి వరించే ...వయసు వరాలే.. ఎదలు హరించే ...చిలిపి శరాలై......కలలు పండించగా గున్న మావి గుబురులో కన్నె కోయిలమ్మ తేనె తెలుగు పాటై పల్లవించవమ్మ... మూగబాసలే ...ముసి ముసి ముసి ముసి.. ముద్దబంతులై ...విరియగా... సామగ సనిదని సామగ సనిదని సామగ సామగ సామగ సామగ సా పదసని నీ గసరిద ద సనిదమ మా నిదమగ గ గమగమ దని.... సా గేదెపుడు నీ పేదవుల్ల ద..దారి విడిచి మా.. మార్గశిరపు గా..గాలులు మురళిగా...విన్న వేళ కన్నె రాధ పులకించే... కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు.... కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు చరణం 2: ఆఅ ఫలించే... రసాలే తరిచి తరించే ...పడుచు నిషాలో.. కవిత లిఖించే ...యువత పేదాల...సుధలు పొంగించగా... సన జాజితొడిమలో... చిన్ని వెన్నెలమ్మ సందే వెలుగులోనే... తానమాడునమ్మ కన్నె చూపులే ...కసి కసి కసి కసి కారు మబ్బులై ..ముసరగ... సామగ సనిదని సామగ సనిదని సామగ సామగ సామగ సామగ సా పదసని నీ గసరిద ద సనిదమ మా నిదమగ గ గమగమ దని... సాయమడుగు సా నీ నీ పరువము దాగ ద దిపుదు మాఘ మ మేడల గాఢము గ..మ..మతల పూలు కోసి మాలు కోసు పలికించే.... కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు.... కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు

Allari Premikudu : Puttadi Bommaku Song Lyrics (పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే)

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి:

పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులుపుట్టే.... పన్నీటి స్నానాలు చేసే వేళలో నున్నని చెంపకు సిగ్గులు పుట్టే అన్నుల మిన్నకు అల్లరి పెట్టే.. కనరాని బాణాలు తాకే వేళలో... చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ చేయూత సాయంగా అందియ్యవేమి నా ప్రేమ సామ్రాజ్యదేవి... పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ సరేనంటే రూపం తాపం సమర్పయామీ నీ సన్నిధిలోనే సమస్తము..నివేగయామీ

చరణం 1:

కునుకుండదు కన్నులలోనా...కుదురుండదు గుండెలలో.. అణువణువు కోరుకుతున్నది...తియ్యని మైకం... ఎదిగోచ్చిన వన్నెల వాన..ఒదిగుండదు వంపులలో చెరనోదిలి ఉరుకుతున్నది ...వయసు వేగం మనసుపడే కానుకా..అందించనా ప్రేమికా దహించితే కోరికా...సహించకే గోపికా అదిరేటి అధరాల ఆనా... అందం చందం అన్ని నీకే...సమర్పయామి ఆనందమంటే చూపిస్తాలే...చెలి ఫాలోమీ పుత్తడి బోమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ

చరణం 2:

నులివెచ్చని ముచ్చటలోన...తొలి ముద్దులు పుచ్చుకోనీ సరిహద్దులు దాటవే...ఒంటరి కిన్నెరసాని నును మెత్తని సోయగమంతా...సరికొత్తగ విచ్చుకోని ఎదరొచ్చిన కాముని సేవకు...అంకితమవనీ అవి ఇవి ఇమ్మనీ...అదే పనిగా వేడనీ ఇహం పరం దువ్వనీ...పదే పదే పాడనీ తెరచాటు వివరాలు అన్నీ... దేహం దేహం తాకే వేళ..సంతర్పయామీ సందేహం మోహం తీరేవేళ...సంతోషయామీ పుత్తడి బొమ్మకు సెగలుపుట్టే ముద్దులగుమ్మకు దిగులు పుట్టే.. పన్నీటి స్నానాలు చేసే వేళలో... నున్నని చెంపకు సిగ్గులు పుట్టే అన్నుల మిన్నకు అల్లరి పెట్టే.. కనరాని బాణాలు తాకే వేళలో... చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ చేయూత సాయంగా అందియ్యవేమి నా ప్రేమ సామ్రాజ్యదేవి... పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ....

Allari Premikudu : Ninnu Choodagaane Song Lyrics (నిన్ను చూడగానే )

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :

నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్ పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్ నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్ కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్ చిట్టి ముద్దు పెట్టనా – పెట్టుకో బుగ్గపండు కొట్టనా – కొట్టుకో లేత పట్టు పట్టనా – పట్టుకో మోజుకొద్ది ముట్టనా – ముట్టుకో సోయగాల దోపిడీకి వాయిదాలు ఒప్పుకోని చోరీ వలపు నీదోచ్ నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్ పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్ నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్ కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్

చరణం 1 :

అమ్మమ్మమ్మా… అబ్బబ్బబ్బా… లాఠీ ఫ్లూటుగ మారిపోయెనమ్మా సరిగమ సరసమా లబ్జుగా ఉందిలేమ్మా లూటీ చేసిన మనసు నాది సుమ్మా ప్రియతమ యమ యమ చనువుగా దోచుకోమ్మా ఖాకి బట్టలున్న ఆడ పోలీసోచ్ జాక్ పాట్ జామపండు నీదేనోచ్ కౌగిలింత లోచ్ ఖైదు చెయ్యవోచ్ పాలపిట్ట నోచ్ పూలు పెట్ట వోచ్ ఒళ్ళు అప్పగించుకుంటే కళ్ళు అప్పగించి నేను ఎట్టా నిదర పోనోచ్

నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్ కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్ నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్ పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్

చరణం 2 :

నీలో కసి నను కాటువేసెనమ్మా మహా మత్తు కసరత్తు ఘాటుగా సాగెనమ్మా నీలో ఫిగరుకు పీకు తప్పదమ్మా కాక పట్టు సోకు పెట్టు ఫేటునే మార్చకమ్మా ఆడపిల్ల అగ్గిపుల్ల అవుతుందోచ్ ఆడుకుంటే ఒళ్ళు గుళ్ళ అవుతుందోచ్ పాటపాడకోచ్ పప్పు లుడకవోచ్ తాపమెందుకోచ్ తాళమెయ్యవోచ్ అల్లరంత చేసి చేసి చిల్లరంత దోచి కున్న చిల్లీ గొడవ చాలోచ్

నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్ పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్ నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్ కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్