9, ఏప్రిల్ 2022, శనివారం

Anthuleni Katha : Devude ichadu Veedhi Okati Song Lyrics (దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..)

చిత్రం: అంతులేని కథ (1976)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: జేసుదాస్

సంగీతం: ఎం.యస్. విశ్వనాథన్




దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం నన్నడిగి తలిదండ్రి కన్నారా.. నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల నీ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు చిట్టమ్మా కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి