చిత్రం : గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం : బప్పిలహరి
రచన : వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పాలబుగ్గ... ఇదిగో పట్టు
ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు
జారేపైట... చప్పున పట్టు
దక్కాలంటే... తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు
లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే పెంచాలా
కామన్ ప్రేమన్ భామన్ ముగ్గులో దించాలా
ఐ లవ్ యూ నా మంత్రం...
చరణం: 1
కంట్లో కథేమిటంట ఒంట్లో కసేమిటింట ఎత్తేయ్ బావుటా
నిన్నే నిలేసుకుంటా నీతో పెనేసుకుంటా లేదోయ్ అలసట
పిల్లా సరేను అంటే మళ్లీ సరాగమంటా లాగించు ముచ్చట
ఈడే విలాసమంటా తోడై కులాసగుంటా సిగ్గే చిటపట
హా... హా... హా... హో... హే... హే... హా... హా...
తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా
ఐ లవ్ యూ నా మంత్రం...
పాలబుగ్గ... ఇదిగో పట్టు ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు జారేపైట... చప్పున పట్టు దక్కాలంటే... తాళిని కట్టు నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు చరణం: 2 నాలో వసంతగాలి నీలో వయస్సు వేడి రేగే జంటగా ఏదో తుఫాను రేగి నాలో ఉయ్యాలలూగి నీలో కలవగా నాలో శివాలు రేపి నిన్నే సవాలు చేసే అందం పండగా షోకే సలాము చేసే నీకే గులాముకాని దమ్మే దండగ పాలబుగ్గ... ఇదిగో పట్టు ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు జారేపైట... చప్పున పట్టు దక్కాలంటే... తాళిని కట్టు నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే పెంచాలా కామన్ ప్రేమన్ భామన్ ముగ్గులో దించాలా ఐ లవ్ యూ నా మంత్రం... ఐ లవ్ యూ మన మంత్రం... ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి