చిత్రం : గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం : బప్పిలహరి
రచన : భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి చరణం: 1 చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చరణం: 2 ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి