21, ఏప్రిల్ 2022, గురువారం

Khadgam : Nuvvu Nuvvu Song Lyrics (నువ్వు...నువ్వు..)

చిత్రం: ఖడ్గం (2002)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సుమంగళి



నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు.... నువ్వు...నువ్వు..నువ్వు,నువ్వు.....నువ్వు...నువ్వు...నువ్వు... నాలోనే నువ్వు నాతోనేనువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నాపెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు నా గుండె మీద నా ఒళ్లంతా నువ్వు బుగ్గల్లో నువ్వూ... మెగ్గల్లే నువ్వు...ముద్దేసే నువ్వూ నిద్దర్లో నువ్వూ... పొద్దుల్లో నువ్వు ప్రతినిముషం నువ్వూ        

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు.... చ: నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు నా మనసును లాలించే చల్లదనం నువ్వు పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు బైట  పడాలనిపించే  పిచ్చిదనం  నువ్వు నాప్రతి యుద్దం నువ్వూ నా సైన్యం నువ్వు నాప్రియ శత్రువు నువ్వూ....నువ్వూ.... మెత్తని మల్లై గిల్లె తొలిచినుకే నువ్వు నచ్చే కష్టం నువ్వూ... నువ్వూ...       ||నువ్వు|| చ: నా సిగ్గును దాచుకునే కౌగిలివే  నువ్వు నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు తీరం దాహం నువ్వు నా మోహం నువ్వు తప్పని స్నేహం నువ్వూ....నువ్వూ.... తీయని గాయం చేసే అన్యాయం నువ్వు అయినా ఇష్టం నువ్వూ...నువ్వూ....                

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు.... మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు నే కోరుకునే నా మరోజన్మ నువ్వు కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వూ.... నా పంతం నువ్వు....నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ.

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు....

నువ్వు...నువ్వు..నువ్వు,నువ్వు.....నువ్వు...నువ్వు...నువ్వు.....        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి