Khadgam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Khadgam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఏప్రిల్ 2022, గురువారం

Khadgam : Musugu Veyyoddu Song Lyrics (ముసుగు వెయ్యొద్దు మనసు మీద)

చిత్రం: ఖడ్గం (2002)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కల్పనా


ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద హేయ్...ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద... చరణం 1: సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని తిరిగిపడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా అందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెన్నక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు... ముసుగు వెయ్యొద్దు మనసు మీద... వలలు వెయ్యొద్దు వయసు మీద.... హేయ్...ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో... చరణం 2: కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ ఉన్నకొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించనీ నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడిచాం సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం... ముసుగు వెయ్యొద్దు మనసు మీద... వలలు వెయ్యొద్దు వయసు మీద....

Khadgam : Meme Indians Song Lyrics (మేమే.. ఇండియన్స్.)

చిత్రం: ఖడ్గం (2002)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: హనీ



తికమక పెట్టే అమాయకత్వం.. చకచకలాడే వేగం.. అలాగ ఉంటాం.. ఇలాగ ఉంటాం.. ఆకతాయిలం మేము.. అరే చెప్పేదేదో సమజ్ అయ్యేట్టు చెప్పరా.. అట్లనే చెప్తా.. వినుకో.. సత్యం పలికే హరిశ్చంద్రులం.. అవసరానికో అబద్ధం.. నిత్యం నమాజు పూజలు చేస్తాం.. రోజు తన్నుకు చస్తాం.. నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.. నమ్మడమేరా కష్టం.. ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం.. నచ్చకుంటే మీ ఖర్మం.. అరె.. కష్టమొచ్చినా కన్నీరొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం.. మేమే.. ఇండియన్స్.. వందనోటు జేబులో ఉంటే నవాబు నైజం పర్సు ఖాళి అయ్యిదంటే ఫకీరు తత్వం కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం పడుచుపిల్ల ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం.. ప్రేమ.. కావాలంటాం.. పైసా.. కావాలంటాం.. ఏవో కలలే కంటాం.. తిక్క తిక్కగా ఉంటాం.. ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం.. తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం.. కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం.. అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం.. రూలూ ఉంది.. రాంగూ ఉంది.. తప్పుకు తిరిగే లౌక్యం ఉందీ.. మేమే.. ఇండియన్స్.. మేమే.. ఇండియన్స్.. కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో.. ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో.. శత్రువుకే ఎదురు తిరిగిన రక్తం మనది.. ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది.. ఈశ్వర్ అల్లా ఏసు.. ఒకడే కదరా బాసు.. దేవుని కెందుకు జెండా.. కావాలా పార్టీ అండా.. మాతృభూమిలో మంటలు పెట్టే మాయగాడి కనికట్టు.. అన్నదమ్ములకు చిచ్చును పెట్టే లుచ్చాగాళ్ళ పని పట్టు.. భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయి ఒట్టు.. మరోసారి ఇటు చూసే ద్రోహుల తోలు తీసి ఆరెట్టు.. దమ్మే ఉంది.. ధైర్యం ఉంది.. తలవంచని తెగ పొగరే ఉంది.. మేమే.. ఇండియన్స్.. మేమే.. ఇండియన్స్..

Khadgam : Nuvvu Nuvvu Song Lyrics (నువ్వు...నువ్వు..)

చిత్రం: ఖడ్గం (2002)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సుమంగళి



నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు.... నువ్వు...నువ్వు..నువ్వు,నువ్వు.....నువ్వు...నువ్వు...నువ్వు... నాలోనే నువ్వు నాతోనేనువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నాపెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు నా గుండె మీద నా ఒళ్లంతా నువ్వు బుగ్గల్లో నువ్వూ... మెగ్గల్లే నువ్వు...ముద్దేసే నువ్వూ నిద్దర్లో నువ్వూ... పొద్దుల్లో నువ్వు ప్రతినిముషం నువ్వూ        

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు.... చ: నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు నా మనసును లాలించే చల్లదనం నువ్వు పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు బైట  పడాలనిపించే  పిచ్చిదనం  నువ్వు నాప్రతి యుద్దం నువ్వూ నా సైన్యం నువ్వు నాప్రియ శత్రువు నువ్వూ....నువ్వూ.... మెత్తని మల్లై గిల్లె తొలిచినుకే నువ్వు నచ్చే కష్టం నువ్వూ... నువ్వూ...       ||నువ్వు|| చ: నా సిగ్గును దాచుకునే కౌగిలివే  నువ్వు నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు తీరం దాహం నువ్వు నా మోహం నువ్వు తప్పని స్నేహం నువ్వూ....నువ్వూ.... తీయని గాయం చేసే అన్యాయం నువ్వు అయినా ఇష్టం నువ్వూ...నువ్వూ....                

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు.... మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు నే కోరుకునే నా మరోజన్మ నువ్వు కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వూ.... నా పంతం నువ్వు....నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ.

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు....

నువ్వు...నువ్వు..నువ్వు,నువ్వు.....నువ్వు...నువ్వు...నువ్వు.....        

7, జూన్ 2021, సోమవారం

Khadgam : Allari Allari Song Lyrics (అహ అల్లరి అల్లరి చూపులతో)

చిత్రం: ఖడ్గం (2002)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రాక్విబ్ ఆలం, కె.యస్.చిత్ర


అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరుగిల్లుడు షురువాయే అరె చెక్కిలి గిలి గిలి గింతాయే ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయవలన తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్నా....అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్నా బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటదే లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నదే ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే మొత్తం నేలమేది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడే తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్నా....అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్నా పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతది తన చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతది మెరిసే మెరుపల్లె వాడొస్తే అబ్బ నా గుండెలోన పిడుగు పడుతుంటదే ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతదే తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్నా....అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్నా...

Khadgam : Govinda Govinda Song Lyrics (గోవిందా...గోవిందా...గోవిందాగోవిందా)

 చిత్రం: ఖడ్గం (2002)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: దేవి శ్రీ ప్రసాద్



గోవిందా...గోవిందా...గోవిందాగోవిందా నుదిటిరాతను మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా లోకమంటా ఏలేవాడా స్వార్ధమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోర్కెలే నెరవేర్చేవాడా నాకునువ్వే తోడునీడా         ||గోవిందా|| కో: గోవిందా గోవిందా..అరెబాగు చెయ్ నను గోవిందా కో: బాగుచెయ్ నను గోవిందా జూబ్లీహిల్స్ లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్సిటి ఇవ్వు హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు వెంటతిరిగే శాటిలైటివ్వు పనికిరాని చవటలకిచ్చిపరమబేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకదిపతి చెయ్ రా మెచ్చి      ||గోవిందా|| పెట్రొలడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు కోరినంత పుడ్డు పెట్టి డబ్బులడగని హొటలు ఇవ్వు అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో రాజ్యసభలో ఎం.పీ.సీటో పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు సింగిల్ నెంబర్ లాట్రీలివ్వు టేక్స్ అడగని ఆస్తులివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్ రా మెచ్చీ         ||గోవిందా || వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు లేకపోతే _వెయ్యిటన్నుల _కోహినూర్ డైమండ్స్ ఇవ్వు మాస్ హీరో చాన్సు లివ్వు _ హిట్టు సినిమా స్టోరీలివ్వు స్లిమ్ముగున్న _ సొమ్ములున్న _హీరోయిన్నే వైపుగ ఇవ్వు హాలీవుడ్ లో స్టూడియోనివ్వు _స్విస్సుబ్యాంకులో బిలియన్లివ్వు కోట్లుతెచ్చే కొడుకులనివ్వు _ హీరోలయ్యే మనవలనివ్వు నన్నుకూడా సి.ఎం.చెయ్యి లేకపోతే పి.ఎం చెయ్యి తెలుగు తెరపై _తిరుగులేని _తరిగిపోని లైపు నియ్యి కో: గోవిందా గోవిందా  బాగుచెయ్ నను గోవిందా  కో: బాగుచెయ్ నను గోవిందా  అరె పైకితేనను గోవిందా  కో: గోవిందా గోవిందా  లక్కుమార్చి నను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే ఏడుకొండలు ఏసి చేస్తా_ ఎయిత్ వండర్ నీగుడి చేస్తా ....||ఏడు||  ||గోవిందా || అయ్య బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటీ?