7, ఏప్రిల్ 2022, గురువారం

Kondaveeti Donga : Sri Anjaneyam Prasannajeneyam Song Lyrics (శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం)

చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయ రాజా

గీత రచయిత : వేటూరి సుందరరామ మూర్తి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

పల్లవి : 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం
స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం

చరణం 1:

రామ అంటే నీకు ప్రేమ భామ అంటే నాకు ప్రేమ ప్రేమ భిక్ష నాకు పెట్టరా
ఆకు పూజ నీకు నోము సోకుపూజ నాకు నోము జంటకింక గంట కొట్టగా
ముద్దులేక ముచ్చటాడు పొద్దులేక పొందులేక ముక్కు
మోజు పడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా
జివ్వు మన్న ఒంట్లో చివుక్కు మంది ప్రాణం ప్రేమ పుష్పం సుమించి ఫలించు వేళలోన
మూసుకున్న నాకు దిక్కు చూపరా మొహనాలు మోయలేక సోయగాలు దాయలేక
జింక లాంటి కంట్లో జిగేలు మంది ప్రాయం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం
స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం

చరణం 2:

కోడె గాలి కొట్టగానే కొంగు జారి కొంప తీసి ఒంపు సోంపు గంప కెక్కెరా
ఆడగాలి సోకగానే కచ్చె పుట్టి రెచ్చగొట్టి కన్నెనీడ కౌగిలించరా
పూటకొక్క పువ్వు పెట్టి పూల బాణమేసికొట్టు మన్మధున్ని ఆపలేనిమత్తు పుట్టెరా
మాపటేల మల్లెలెట్టి చీకటేల చిచ్చుబెట్టు పిల్లదాన్ని చూడగానే పిచ్చె పట్టెరా
పెట్టలేదు కామా ఇదేమి ప్రేమ గీతం
చెప్పలేను రామ మదీయ మౌన భావం
మంత్ర పుష్పం మనస్సు మదించు వేళలోన

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం
స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి