చిత్రం: మామగారు (1991)
సంగీతం: రాజ్ - కోటి రచన: వేదవ్యాస గాయకులు: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
శ్రీరాముడల్లె శ్రీకృష్ణుడల్లె ఏ వంకలేనోడే
ఏ మచ్చ లేని జాబిల్లి మల్లే ఎన్నెల్లు చల్లాడే
నింగి వొంగింది నేల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో
పేదరాగంలో మారుమోగింది పెళ్ళి సన్నాయి అమ్మమ్మో
ఊరు పేరు లేని నన్ను గుండెల్లో దాచుకున్నావే
ఏరికోరి నిన్నే ఏరువాకల్లె చేరుకున్నానే
తానుగా మెచ్చెనే తావి లేని పువ్వుని
పూలకే తావిలే చిన్ని నీ నవ్వే
ఏ జన్మలోను ఏనాడు ఏ పూజలే చేసానో?
పుణ్యాలు పండే ఈనాడు ఈ దేవుడే నావాడు
ఏనాడు నీవు నాలోనే నేను నీలోనే అమ్మమ్మో
తోడునీడలోనే ముద్దు ముచ్చట్లు ఇంత వింతాయే
ఎన్ని జన్మలైనా వీడిపోలేని బంధమింతేలే
పల్లవే నీవని కోయిలమ్మ పాటలో
నిత్యము ఆమనే నిండు నీ వొడిలో
మావాడకొచ్చి మావాడై మా మంచినే కోరావే
చుక్కల్ని వీడి నాతోడై నా పక్కనే చేరావే
చక్కన్ని చుక్క నీవేలే వేల చుక్కల్లో అమ్మమ్మో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి