23, ఏప్రిల్ 2022, శనివారం

Nirnayam : Epudepudani Song Lyrics (ఎపుడెపుడెపుడని)

చిత్రం: నిర్ణయం (1991)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా 


ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం వెయ్యేళ్ళ వియ్యాలతో పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో యద యద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం నా...ఉదయమై వెలిగే ప్రియ వరం అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం వెయ్యేళ్ళ వియ్యాలతో అహా...పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో యద యద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా పెదవుల ముడి పెడదాం యదల్లో మదనుడి గుడి కడదాం వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడుదాం రా...వెతుకుదాం రగిలే రసజగం అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం 

యద యద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి