Nirnayam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nirnayam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఏప్రిల్ 2022, శనివారం

Nirnayam : Epudepudani Song Lyrics (ఎపుడెపుడెపుడని)

చిత్రం: నిర్ణయం (1991)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా 


ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం వెయ్యేళ్ళ వియ్యాలతో పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో యద యద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం నా...ఉదయమై వెలిగే ప్రియ వరం అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం వెయ్యేళ్ళ వియ్యాలతో అహా...పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో యద యద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా పెదవుల ముడి పెడదాం యదల్లో మదనుడి గుడి కడదాం వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడుదాం రా...వెతుకుదాం రగిలే రసజగం అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం 

యద యద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో 

2, జూన్ 2021, బుధవారం

Nirnayam : Hello Guru Premakosameraa Jeevitham Song Lyrics (హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం)

చిత్రం: నిర్ణయం (1991)

రచన: గణేష్ పాత్రో

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా 



హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం

మగాడితో ఆడదానికేలా పౌరుషం

ప్రేమించాను దీన్నే 

కాదంటోంది నన్నే

మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని.. హార్నీ

హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం

మగాడితో ఆడదానికేలా పౌరుషం


ఉంగరాల జుట్టువాడ్ని  ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని

చదువు సంధ్య  కల్గినోడ్ని చౌకబేరమా?

గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోడ్ని

కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా?

నా కన్న నీ కున్న తాకీదు లేంటామ్మ

నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మా

నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా

నా కన్నా ప్రేమించే మొనగాడు ఎవడమ్మా

ఐ లవ్ యు డార్లింగ్ బికాస్యు  అర్ చార్మింగ్

ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే .. వై నాట్



కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోనే కట్టుకోను

ఒట్టు పెట్టుకుంటినమ్మ బెట్టు చేయకే

అల్లి బిల్లి గారడీలు చెల్లవింకా చిన్నదానా

అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగల

నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్ డ్యూయెట్లు

నా చేత్తో తినిపిస్త మన పెళ్ళి బొబ్బట్లు

ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట

అభిమన్యుడు శశిరేఖా అందాల జంటఅంట

అచ్చ మైనే ప్యార్ కియా లుచ్చయా కాం నహి కియా

అమీ తుమీ తేలకుంటే నిన్ను లేవదీసుకుపోతా, అర్ యు రెడీ


హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం

మగాడితో ఆడదానికేలా పౌరుషం

ప్రేమించాను దీన్నే 

కాదంటోంది నన్నే

మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని.. హార్నీ

హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం

మగాడితో ఆడదానికేలా పౌరుషం



19, ఏప్రిల్ 2013, శుక్రవారం

Nirnayam : Milamila merisenu tara Song Lyrics (మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా)

చిత్రం: నిర్ణయం (1991)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా 



పల్లవి: (Introduction) Male : మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
Female : చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల
Male: గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా Female :వేధించెలే నన్నే నీ నీడలా Male: మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా చరణం1: Male: వెచ్చనైన గుండె గిన్నెలో వెన్ననింక దాచి వుంచుకో Female :పొన్నచెట్టు లేని తోటలో కన్నె వేణువాలపించకు Male: ప్రేమ అన్నదే ఓ ఓ ఓ పల్లవైనది Female :పెదవి తాకితే ఓ ఓ ఓ పాటలే అది Male: ఆమని ప్రేమని పాడే కోయిల Male: మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా Female : చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల Male: గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా Female :వేధించెలే నన్నే నీ నీడలా చరణం2: Female :మౌనమైన మాధవీలత తాను కొమ్మనల్లుకున్నది Male: వేల్లువైన రాగమిప్పుడే ఏకతాళమందుకున్నది Female :తోచదాయెనే ఓ ఓ ఓ తోడులేనిదే Male: కౌగిలింతలే ఓ ఓ ఓ కావ్యమాయెలే Female :ఎన్నడూ లేనిది ఎందుకో ఇలా Male: మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా Female :చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల Male: గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా Female :వేధించెలే నన్నే నీ నీడలా Male: మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా