చిత్రం: పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల
సంగీతం: ఘంటసాల
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి ! కావనగానే సరియా ఈ పూవులు నీవేగా.. దేవీ..
పల్లవి:
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి దేవీ.. చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా.. చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి
చరణం:
మలయానిలముల లాలన వలెనే వలపులు హాయిగ కురిసీ.. మలయానిలముల లాలన వలెనే వలపులు హాయిగ కురిసీ.. కలికి చూపులను చెలిమిని విరిసి చిలిపిగ దాగుట న్యాయమా? .. చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి
చరణం:
తెలి మబ్బులలో జాబిలి వలెనే కళకళ లాడుచు నిలిచీ..తెలి మబ్బులలో జాబిలి వలెనే కళకళ లాడుచు నిలిచీ.. జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి పలుకక పోవుట న్యాయమా?.. చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా.. చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి