2, ఏప్రిల్ 2022, శనివారం

RRR (Roudram Ranam Rudhiram ) : Komuram Bheemudo Song Lyrics

చిత్రం: రౌద్రం రణం రుధిరం(RRR) (2021)

రచన: సుద్దాల అశోక్ తేజ

గానం: కాల భైరవ

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



భీమా...!! నినుగన్న నేల తల్లి... ఊపిరిబోసిన సెట్టు సేమ... పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా... ఇనవడుతుందా...! పల్లవి : కొమురం భీముడో... కొమురం భీముడో... కొర్రాసునెగడోలే... మండాలి కొడుకో... మండాలి కొడుకో...!! కొమురం భీముడో... కొమురం భీముడో... రగరాగ సూరిడై... రగలాలి కొడుకో... రగలాలి కొడుకో...!! చరణం 1 : (Start) కాల్ముక్తా భాంచేనని ఒంగి తోగాలా... కారాడవి తల్లీకి పుట్టానట్టేరో... పుట్టానట్టేరో.. జులుము గద్దేకుతలను.. వొంచి తోగాలా... ఉడుమూ తల్లీ పేగుల పెరగా నట్టేరో...! పెరగా నట్టేరో...!! కొమురం భీముడో... కొమురం భీముడో... కొర్రాసునెగడోలే... మండాలి కొడుకో... మండాలి కొడుకో... ! చరణం 2 : ( Middle ) సెమ్మా మొలిసే తెప్పకు ఒప్పంటోగాలా.. సిమికే రత్తము సూసి సెదిరీ తోగాలా... గుగులేసి కన్నీరు ఒలికీ తోగాలా.. భూ తల్లీ సనుభాలు తాగా నట్టేరో...! తాగా నట్టేరో...!! కొమురం భీముడో... కొమురం భీముడో... కొర్రాసునెగడోలే... మండాలి కొడుకో... మండాలి కొడుకో... ! చరణం 3 : or ( End Bit) కాలువై పారె నీ గుండే నెత్తూరూ... కాలువై పారె నీ గుండే నెత్తూరూ... నేలమ్మా నుదిటీ బొట్టయితుంది సూడు... అమ్మా కాళ్ళ పారానైతుంది సూడు... తల్లీ పెదవుల నవ్వై మెరిసింధి సూడు... కొమురం భీముడో... కొమురం భీముడో... పుడమీ తల్లికీ జనమా హరనామిస్తివిరో... కొమురం భీముడో.........!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి