చిత్రం: సంకీర్తన (1987)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి: వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలై వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా ఓ గంగమ్మో పొద్దెక్కిపోతోంది తొరగా రాయే ఓ తల్లి గోదారి తుళ్ళీ తుళ్ళీ పారేటి పల్లే పల్లే పచ్చని పందిరి పల్లే పల్లే పచ్చని పందిరి నిండు నూరేళ్ళు పండు ముత్తైదువల్లె ఉండు పంట లచ్చిమి సందడి పంట పంట లచ్చిమి సందడి తందైన తందతైన తందైన తందతైన తందైన తందతైయ్యనా .. తయ్య తందైన తందతైయ్యనా చరణం:1 వాన వేలితోటి నేల వీణ మీటే నీలి నింగి పాటే ఈ చేలట కాళిదాసు లాటి తోట వ్రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట ప్రతి కదలికలో నాట్యమే కాదా ప్రతి ౠతువూ ఒక చిత్రమే కాదా యదకే కనులుంటే వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలై వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి