9, ఏప్రిల్ 2022, శనివారం

Simharasi : Pedalante Song Lyrics (పేదలంటే ప్రాణమిచ్చే )

చిత్రం : సింహరాశి (2001)

సంగీతం : యస్.ఏ.రాజ్ కుమార్  రచన : వెనిగళ్ళ రాంబాబు గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత




పల్లవి : పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు ॥ దానవీరశూరకర్ణ నరసింహరాజు సింహరాశిలో నువు పుట్టినావయ్యా జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా

పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు ॥ చరణం : 1 పేదోళ్ల బతుకుల్లో పండగ నీవు నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు బ్రతుకు బరువై లేకున్న చదువు చదువులమ్మకు అయినాడు గురువు మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు మా కంటిచూపుల్లో సూరీడే నీవు ఏ పుణ్యఫలమో నీ తల్లి రుణమై ॥॥ చరణం : 2 కటిక నేలే నీ పట్టుపరుపు పూరి గుడిసెను గుడి చేసినావు కట్టుపంచే నీకున్న ఆస్తి కోట్లు ఉన్న నిరుపేదవయ్యా కన్నీళ్లు తుడిచే అన్నవు నీవు కన్నోళ్ల కలలే పండించినావు ఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి సాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది గిట్టినప్పుడు మనతో వచ్చిందేముంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి