7, మే 2022, శనివారం

Disco Raja : Nuvvu Naatho Emannavo Song Lyrics (నువ్వు నాతో ఏమన్నావో)

చిత్రం: డిస్కో రాజా (2018)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: తమన్



నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా ఏటు సాగలో అడగని ఈ గాలితో ఎపుడాగాలో తెలియని వేగాలతో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నీలాల నీ కనుపాపలో ఏ మేఘా సందేశమో ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే చిరునామా లేనీ లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి మౌనరాగాలు పలికే సరాగలతో మందహసాలు చిలికే పరాగలతో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని, పెంచుదాం మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి