20, మే 2022, శుక్రవారం

Nuvvu Naaku Nachav : Aakasam Dhigi Vachi Song lyrics (ఆకాశం దిగివచ్చి)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కోటి




పల్లవి : ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే

చరణం : 1

చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా

చరణం : 2

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులు పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి