20, మే 2022, శుక్రవారం

Nuvvu Naaku Nachav : Naa Chupe Ninu Song Lyrics (నా చూపే నిను వెతికినది)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)

రచన:  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.యస్.చిత్ర, శ్రీరామ్ ప్రభు

సంగీతం:  కోటి

పల్లవి:

నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది 
నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది 
నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది 

చరణం:1

నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తియ్యదనం 
నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం 
గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే వేలు పట్టి నడిపిస్తాలే నావెంటే నీవుంటే 
నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది 
నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది 
నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది 
నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది

చరణం:2

పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం 
అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం 
దిగులు కూడ తీయగ లేదా ఎదురు చూస్తు ఉంటే 
పగలు కూడ రేయైపోదా నీవుంటే నావెంటే 
నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది 
నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది 
నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది 
నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి