Nuvvu Naaku Nachav లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nuvvu Naaku Nachav లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మే 2022, శుక్రవారం

Nuvvu Naaku Nachav : Aakasam Dhigi Vachi Song lyrics (ఆకాశం దిగివచ్చి)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కోటి




పల్లవి : ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే

చరణం : 1

చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా

చరణం : 2

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులు పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా



Nuvvu Naaku Nachav : Naa Chupe Ninu Song Lyrics (నా చూపే నిను వెతికినది)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.యస్.చిత్ర, శ్రీరామ్ ప్రభు

సంగీతం: కోటి



పల్లవి:

నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది

చరణం:1

నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తియ్యదనం నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే వేలు పట్టి నడిపిస్తాలే నావెంటే నీవుంటే నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది

చరణం:2

పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం దిగులు కూడ తీయగ లేదా ఎదురు చూస్తు ఉంటే పగలు కూడ రేయైపోదా నీవుంటే నావెంటే నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది




2, జులై 2021, శుక్రవారం

Nuvvu Naaku Nachav : Okkasari Cheppaleva Song (ఒక్కసారి చెప్పలేవా)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.యస్.చిత్ర, కుమార్ సాను

సంగీతం: కోటి


పల్లవి:

ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని.. చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని.. మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత.. ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ.. వెన్నెలేదో.. వేకువేదో.. నీకు తెలుసా మరి నిదురపోయే మదిని గిల్లి.. ఎందుకా అల్లరి

చరణం:1
చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని  చంటిపాపలకు చెబుతామా లేని పోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని జన్మలోనే నిదరోకు అని  కంటిపాపలకు చెబుతామా కలలన్నవి కలలని నమ్మనని  అవి కలవని పిలవకు కలవమని.. మది మీటుతున్న మధురానుభూతి  మననడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని.. చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని..
చరణం:2

అందమైన హరివిల్లులతో  వంతెనేసి చిరుజల్లులతో చుక్కలన్ని దిగి వస్తుంటే  కరిగిపోని దూరం ఉందా అంతులేని తన అల్లరితో  అలుపు లేని తన అలజడితో కెరటమెగిరి పడుతూ ఉంటే  ఆకాశం తెగి పడుతుందా మనసుంటే మార్గం ఉంది కదా  అనుకుంటే అందనిదుంటుందా  అనుకున్నవన్ని మనకందినట్టే  అనుకుంటే తీరిపోదా ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని.. చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని.. మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత.. ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ

 

1, జులై 2021, గురువారం

Nuvvu Naaku Nachav : O Navvu Chalu Song Lyrics (ఓ నవ్వు చాలు)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శంకర్ మహదేవన్

సంగీతం: కోటి



పల్లవి:

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు

తాను పలికితె చాలు తేనె జలపాతాలు


ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది

ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది

చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది

పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా

తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా


చరణం:1

గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల

కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో

గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా

మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో

అలా నడిచి వస్తూంటే పూవుల వనం

శిలైపోని మనిషుంటే మనిషే అనం


ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది


చరణం:2


గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం

ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను

గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం

రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను

కలో కాదో నాకే నిజం తేలక

ఎలా చెప్పడం తాను నాకెవ్వరో

అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ

ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ


ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది

ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది

చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది

పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా

తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా





30, జూన్ 2021, బుధవారం

Nuvvu Naaku Nachav : O Priyathama Song Lyrics (ఓ ప్రియతమా ఇది నిజమా)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)

రచన: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కోటి



పల్లవి:

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం … శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా ఏ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదనా… తొలి ప్రేమలోని మధుర భావనా…

చరణం:1

ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చిగురించెనో వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై వీచాయో చెప్పేదెలా ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా ఓ పిర్యతమా దయగనుమా నీ చూపే చాలు చంద్రకిరణమా నా జన్మ ధన్యమవును ప్రాణమా…

చరణం:2

చివురాకుల పొత్తిలిలో వికసించిన సిరిమల్లెవో చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే నీ నామాన్నే శృంగార వేదంగ భావించి జపిస్తున్నానే చెలి… నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి ఓ ప్రియతమ ఊఉననుమా కనలేవ ప్రియుని హృదయవేదనా కరుణించు నాకు వలపు దీవెనా… ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం … శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా





22, డిసెంబర్ 2011, గురువారం

Nuvvu naaku nachav : Unna Maata Cheppalenu Song Lyrics (ఉన్నమాట చెప్పలేను)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: టిప్పు, హరిణి

సంగీతం: కోటి



పల్లవి:

ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ

అన్నుకున్నా తప్ప్పు కదా మోమాటం ముప్పుకదా

మనసైతే ఉంది కదా మనమాటే వినదు కదా

పంతం మానుకో భయం దేనికో                           


ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ


చరణం:1

వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా

నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా

నన్నస పెట్టి ఈ సరదా రేపినదే నువ్ గనుకా

నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా

అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా

అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా

ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా                       


నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ

ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ


చరణం:2

అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా

అయోమయంగ వేయకలా హాయి వల

నీమీదికొచ్చి మురిపాలే వాలదుగా వాలుజడా

దానొంక చూసి ఎందుకట గుండెదడ

మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా

తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా

మరేం చేయనే నీతో ఎలా వేగనే                   


నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ

ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ

అన్నుకున్నా తప్ప్పు కదా మోమాటం ముప్పుకదా

మనసైతే ఉంది కదా మనమాటే వినదు కదా

పంతం మానుకో భయం దేనికో   

ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ