చిత్రం: వాన (2011)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కార్తీక్
సంగీతం: కమలాకర్
ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా.. జల జల జడిగా తొలి అలజడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా... ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా.. కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే చిటపటలాడి వెలసిన వాన మెరుపుల దాడి కనుమరుగైనా నా గుండె లయలో విన్నా నీ అలికిడీ... ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా.. ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా.. ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా మనసుని నీతో పంపిస్తున్నా నీ ప్రతి మలుపూ తెలుపవె అన్నా ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా.. జల జల జడిగా తొలి అలజడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా... ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి