8, మే 2022, ఆదివారం

Vaana : Sirimalle Vaana Song Lyrics (సిరిమల్లె వాన పడుతోంది )

చిత్రం: వాన (2011)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రంజిత్, కె.యస్.చిత్ర

సంగీతం: కమలాకర్



సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి వడగళ్ళ వాన ఉరిమింది ఐనా వినిపించదే జంటకి తడిసే తరుణాన గొడుగై నే లేనా

సిరిమల్లె .... సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి

వల అనుకోనా వలపనుకోనా కలిపిన ఈ బంధం వలదనుకున్నా వరమనుకున్నా తమరికి నే సొంతం చినుకై వచ్చావే వరదై ముంచావే

సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి

చిలిపిగ ఆడి చెలిమికి ఓడి గెలిచా నీపైన తగువుకు చేరి తలపుగ మారి నిలిచా నీలోన మనసే ఈ వింత మునుపే చూసిందా


సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి వడగళ్ళ వాన ఉరిమింది ఐనా వినిపించదే జంటకి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి