చిత్రం: వాన (2011)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: రంజిత్
సంగీతం: కమలాకర్
ఢోలారే ధుమారం దేఖోరే అరే అరే అనరే బాపురే ఝూమోరే ఝమాఝం నాచోరే హుర్రే హుర్రే అనదా ఊపిరే అరె పిల్లగాలి పలికిందా సన్నాయి పాటలా అరె కళ్ళలోన కులికిందా హరివిల్లు నేడిలా కింద మీద చూడనంటు సందడేదొ ఆగనంటు బొంగరాల గింగిరాల చందనాలు రేగు వేళ మనింటిలో వేడుక విన్నంతటా హంగామా కళ్యాణమే చూడగ ఖంగారు కలిగిద్దామా జగాలకే చాటుగా జువ్వల్ని ఎగరేద్దామా చుట్టాలుగా చేరగా చుక్కల్ని దిగమందామా ఈవాళే రావాలి పగలే ఇలా రంగేళి రేగాలి నలువైపులా నింగి నేల ఏకమైన రంగ రంగ వైభవాన ఛంగు ఛంగు ఛంగుమంటు చిందులాట సాగువేళ ఢోలారే ధుమారం దేఖోరే అరే అరే అనరే బాపురే పొద్దెక్కినా లేవక బజ్జోకుమా పాపాయి నెత్తెక్కి తొక్కేతనం అత్తింటిలో ఆపేయి కుర్రాళ్ళతో దీటుగ కుంగ్ఫులవీ మానేయి ఎన్నాళ్ళే ఈ వాలకం ఇల్లలుగా అడుగెయ్యి అమ్మయ్యి లోకాన్నే అమ్మాయివై తీరంత మార్చాలి ఆరిందవై పిల్లతాను నీ బడాయి చెల్లదింక ఆకతాయి అల్లరంత ఇక్కడొదిలి పల్లకీని చేరువేళ ఢోలారే ధుమారం దేఖోరే అరే అరే అనరే బాపురే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి