27, మే 2022, శుక్రవారం

Yamagola : Oh Lammi Tikkaregindaa Song Lyrics (ఓలమ్మీ తిక్క రేగిందా)

చిత్రం: యమగోల (1977)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల చిచ్చురేపి రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా కాలు కురచ కన్నెపిల్ల కన్ను చెదిరిందా మూరతక్కువ చీర నీకు నిలవనంటుందా పక్కపలక ఉడుకు నీలో అలిసిపోయిందా ముట్టుకుంటె ముద్దులయ్యె పట్టుకుంటె జారిపోయె సిగ్గు వలపు మొగ్గలేసిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా రంగు తేలి గిత్త పొగరు రంకె వేసిందా గంగడోలు తాకితేనే కాలు చూపిందా కోడె వయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా పట్ట పగలే చుక్క పొడిచె పంటచేను గట్టు మీద బంతిపూల పక్కవేసిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు చల్లకొచ్చి ముంత ఎందుకు దాచుకుంటావు వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు ఆరుబయట అందమంత ఆరబోసి కస్సుమంటు కన్నెమోజు కట్టు తప్పిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి