27, మే 2022, శుక్రవారం

Yamagola : Aadave Andaala Surabhaamini Song Lyrics (ఆడవే అందాల సురభామిని)

చిత్రం: యమగోల (1977)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



పల్లవి:

ఆడవే అందాల సురభామిని ఆడవే అందాల సురభామిని .. పాడవే కళలన్నీ ఒకటేననీ..ఆడవే అందాల సురభామిని గానమేదైనా స్వరములొక్కటే పనిపస నిసనిగ నిపమగ మపగస మగసని సగని నాట్యమేదైనా నడక ఒక్కటే ..భాష ఏదైనా భావమొక్కటే .. అన్ని కళల పరమార్థమొక్కటే ..అందరినీ రంజింపజేయుటే.. ఆ.ఆ.. ఆడవే అందాల సురభామిని

చరణం 1:

ఓహో రంభా!.. సకల కళానికురంభా రాళ్ళనైనా మురిపించే జాణవట అందానికి రాణివట ఏదీ ? నీ హావభావ విన్యాసం ఏదీ ? నీ నాట్యకళాచాతుర్యం ఆఆఆ... ఆఆఆ ... ఆఆఆఆఆఆ అరువది నాలుగు కళలందు మేటిని .. అమరనాథునికి ప్రియ వధూతిని అరువది నాలుగు కళలందు మేటిని .. అమరనాథునికి ప్రియ వధూతిని సరసాలలో ఈ సురశాలలో .. .. సరసాలలో ఈ సురశాలలో..సాటిలేని శృంగార వాసిని ..నిత్యనూతన రాగ స్రవంతిని రసవంతిని జయ జయ వంతిని ..రసవంతిని జయ జయ వంతిని

చరణం 2:

ఓహో ఊర్వశీ!.. అపురూప సౌందర్య రాశి ఏదీ ? నీ నయన మనోహర నవరస లాస్యం ఏదీ ? నీ త్రిభువన మోహన రూప విలాసం మదనుని పిలుపే నా నాదము ..స్మర కదన శాస్త్రమే నా వేదము మదనుని పిలుపే నా నాదము .. స్మర కదన శాస్త్రమే నా వేదము కనువిందుగా ..కరగని పొందుగా ..కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము అంతులేని శృంగార పిపాసిని .. తరతరాల మీ ప్రేయసిని... చారుకేశిని !

చరణం 3:

ఓహో మేనకా!.. మదన మయూఖా సాగించు నీ రాసలీలా.. చూపించు శృంగార హేలా .. సాగించు నీ రాసలీలా నగవులతో మేని బిగువులతో ... నగవులతో మేని బిగువులతో ..వగలొలకించు వయ్యారి నెరజాణను ఏ చోట తాకినా... ఏ గోట మీటినా ..మధువులొలికించు మరులు చిలికించు మధురమైన రసవీణను .. రతిరాజ కళా ప్రవీణను సారంగలోచనను ! ఆడవే అందాల సురభామిని .. పాడవే కళలన్నీ ఒకటేననీ .. ఆడవే అందాల సురభామిని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి