Yamagola లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yamagola లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మే 2022, శుక్రవారం

Yamagola : Oh Lammi Tikkaregindaa Song Lyrics (ఓలమ్మీ తిక్క రేగిందా)

చిత్రం: యమగోల (1977)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల చిచ్చురేపి రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా కాలు కురచ కన్నెపిల్ల కన్ను చెదిరిందా మూరతక్కువ చీర నీకు నిలవనంటుందా పక్కపలక ఉడుకు నీలో అలిసిపోయిందా ముట్టుకుంటె ముద్దులయ్యె పట్టుకుంటె జారిపోయె సిగ్గు వలపు మొగ్గలేసిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా రంగు తేలి గిత్త పొగరు రంకె వేసిందా గంగడోలు తాకితేనే కాలు చూపిందా కోడె వయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా పట్ట పగలే చుక్క పొడిచె పంటచేను గట్టు మీద బంతిపూల పక్కవేసిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు చల్లకొచ్చి ముంత ఎందుకు దాచుకుంటావు వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు ఆరుబయట అందమంత ఆరబోసి కస్సుమంటు కన్నెమోజు కట్టు తప్పిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా

Yamagola : Aadave Andaala Surabhaamini Song Lyrics (ఆడవే అందాల సురభామిని)

చిత్రం: యమగోల (1977)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



పల్లవి:

ఆడవే అందాల సురభామిని ఆడవే అందాల సురభామిని .. పాడవే కళలన్నీ ఒకటేననీ..ఆడవే అందాల సురభామిని గానమేదైనా స్వరములొక్కటే పనిపస నిసనిగ నిపమగ మపగస మగసని సగని నాట్యమేదైనా నడక ఒక్కటే ..భాష ఏదైనా భావమొక్కటే .. అన్ని కళల పరమార్థమొక్కటే ..అందరినీ రంజింపజేయుటే.. ఆ.ఆ.. ఆడవే అందాల సురభామిని

చరణం 1:

ఓహో రంభా!.. సకల కళానికురంభా రాళ్ళనైనా మురిపించే జాణవట అందానికి రాణివట ఏదీ ? నీ హావభావ విన్యాసం ఏదీ ? నీ నాట్యకళాచాతుర్యం ఆఆఆ... ఆఆఆ ... ఆఆఆఆఆఆ అరువది నాలుగు కళలందు మేటిని .. అమరనాథునికి ప్రియ వధూతిని అరువది నాలుగు కళలందు మేటిని .. అమరనాథునికి ప్రియ వధూతిని సరసాలలో ఈ సురశాలలో .. .. సరసాలలో ఈ సురశాలలో..సాటిలేని శృంగార వాసిని ..నిత్యనూతన రాగ స్రవంతిని రసవంతిని జయ జయ వంతిని ..రసవంతిని జయ జయ వంతిని

చరణం 2:

ఓహో ఊర్వశీ!.. అపురూప సౌందర్య రాశి ఏదీ ? నీ నయన మనోహర నవరస లాస్యం ఏదీ ? నీ త్రిభువన మోహన రూప విలాసం మదనుని పిలుపే నా నాదము ..స్మర కదన శాస్త్రమే నా వేదము మదనుని పిలుపే నా నాదము .. స్మర కదన శాస్త్రమే నా వేదము కనువిందుగా ..కరగని పొందుగా ..కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము అంతులేని శృంగార పిపాసిని .. తరతరాల మీ ప్రేయసిని... చారుకేశిని !

చరణం 3:

ఓహో మేనకా!.. మదన మయూఖా సాగించు నీ రాసలీలా.. చూపించు శృంగార హేలా .. సాగించు నీ రాసలీలా నగవులతో మేని బిగువులతో ... నగవులతో మేని బిగువులతో ..వగలొలకించు వయ్యారి నెరజాణను ఏ చోట తాకినా... ఏ గోట మీటినా ..మధువులొలికించు మరులు చిలికించు మధురమైన రసవీణను .. రతిరాజ కళా ప్రవీణను సారంగలోచనను ! ఆడవే అందాల సురభామిని .. పాడవే కళలన్నీ ఒకటేననీ .. ఆడవే అందాల సురభామిని

Yamagola : Chilaka Kottudu Kodithe Song Lyrics (చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా..)

చిత్రం: యమగోల (1977)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా హా... చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా. అహ . రాటుతేలిపోయావు. నీటుగాడా . అహహహ రాటి తేలిపోయావు నీటుగాడా. నీ నాటు సరసం చాలులే పోటుగాడా హేయ్ చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా మాపటేళా ఆకలేసి .హా.మంచెకాడ కౌగిలిస్తే.హా. అబ్బా. నీ సోకుమాడా.అబ్బో. ఓయబ్బో. దబ్బపండంటిదానా . అమ్మో. ఓలమ్మో. జబ్బాల నునుపు చూడ వేడెక్కి .డీడిక్కి అంటుందిలే... అమ్మమ్మ. అల్లిబిల్లి తీగలల్లే. అల్లుకుంటే. ఝల్లుమంటే. ఊరి పొలిమేరకాడా. అయ్యో.ఓరయ్యో. ఊరించుకళ్ళలోనా. అమ్మో. ఓలమ్మో. కవ్వించు నీలి నీడ. కైపెక్కి. తైతక్కలాడిందిలే.ఏ. ఏ ... అహహహా. చిలక కొట్టుడు కొడితే. చిన్నదనా. పలక మారి పోతావే పడుచుదానా. అహ .రాటుతేలిపోయావు. నీటుగాడా నీ నాటు సరసం చాలులే పోటుగాడా వలపు వాగు పొంగుతుంటే.హా. వాడి చూపు వంతెనేసి. హో. వలపు వాగు పొంగుతుంటే.హా. వాడి చూపు వంతెనేసి. హో. సపంగి చెట్టు కాడా. అయ్యో. ఓరయ్యో. ఒంపుల్ల సొంపులాడ . అమ్మో. ఓలమ్మో. చెంపల్లో కెంపులన్ని. ముద్దిచ్చి. మూటగట్టుకో అరెరెరె. కోరికంతా కోక చుట్టి. కొంగులోనా పొంగు దాచి కోరికంతా కోక చుట్టి. కొంగులోనా పొంగు దాచి ముంత మామిడి గున్న. అమ్మో. ఓలమ్మో రమణీ ముద్దుల గుమ్మ . అమ్మో. అమ్మమ్మో విరబూసి నవ్వింది. నవ్వులన్ని పువ్వులెట్టుకో. ఓ ఓ ఓ. హోయ్ హాయ్.చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా అహ .రాటుతేలిపోయావు. నీటుగాడా నీ నాటు సరసం చాలులే పోటుగాడా

21, జులై 2021, బుధవారం

Yamagola : Gudivada Vellanu Song Lyrcis (గుడివాడ ఎళ్ళాను..గుంటూరు పొయ్యాను..)

చిత్రం: యమగోల (1977)

రచన: వేటూరి

గానం: పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు కసి కసిగా హా కొందరు నన్ను పాడమంటారు పచ్చిగ ఆడమంటారు నచ్చారంటె జై కొడతారు నచ్చకపోతే చీ కొడతారు పిచ్చి పిచ్చిగా పైపడతారు దుమ్ము కాస్తా దులిపేస్తారు పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు ఓ యబ్బో పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను చిత్తూరు పుట్టూరు ఎన్నెన్నో చూసాను బందరులోనా అందరిలోనా రంభవి అన్నాడు ఒకడు రావే అన్నాడు వైజాకు బాబు చేసాడు డాబు రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు కాకినాడలో గల్లంతాయె తిరపతి లోనా పరపతి పోయే అన్రై మెప్పు పొందాలంటె దేవుడైకైన తరం కాదు ఆ యముడికైనా తరం కాదు గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు అమ్మమ్మో గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు