17, ఆగస్టు 2022, బుధవారం

Devadasu(ANR) : Kudi Yadamaithe Song Lyrics (కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్)

చిత్రం: దేవదాసు (1953)

సాహిత్యం: సముద్రాల సీనియర్

సంగీతం: సి.ర్.సుబ్బురామన్, ఎం.యస్.విశ్వనాథన్

గానం: ఘంటసాల 



కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్. ఓడిపోలేదోయ్. ఓ ఓ ఓ... ఓయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్. ఓ... ఓయ్ సుడిలో దూకీ ఎదురీదకా. ఆ ఆ ఆ ఆ . . . సుడిలో దూకీ ఎదురీదకా. ఆ ఆ... మునకే సుఖమనుకోవోయ్... మునకే సుఖమనుకోవోయ్... కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్. ఓడిపోలేదోయ్. ఓ ఓ ఓయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ మేడలోనే అల పైడి బొమ్మా. నీడనే చిలకమ్మా. ఆ ఆ ఆ ఆ... మేడలోనే అల పైడి బొమ్మా. నీడనే చిలకమ్మా... ఆ ఆ... కొండలే రగిలే వడగాలీ. కొండలే రగిలే వడగాలీ నీ సిగలో పూవేలోయ్. నీ సిగలో పూవేలోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ చందమామా మసకేసి పోయే. ముందుగా కబురేలోయ్. ఓ ఓ ఓ... ఓ య్... చందమామా మసకేసి పోయే. ముందుగా కబురేలోయ్ . ఓ ఓ య్. లాయిరీ నడిసంద్రములోనా. లాయిరీ నడిసంద్రములోనా లంగరుతో పని లేదోయ్. లంగరుతో పని లేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్. ఓడిపోలేదోయ్. ఓ ఓ ఓయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి