Devadasu (ANR) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Devadasu (ANR) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2022, బుధవారం

Devadasu(ANR) : Kudi Yadamaithe Song Lyrics (కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్)

చిత్రం: దేవదాసు (1953)

సాహిత్యం: సముద్రాల సీనియర్

సంగీతం: సి.ర్.సుబ్బురామన్, ఎం.యస్.విశ్వనాథన్

గానం: ఘంటసాల 



కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్. ఓడిపోలేదోయ్. ఓ ఓ ఓ... ఓయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్. ఓ... ఓయ్ సుడిలో దూకీ ఎదురీదకా. ఆ ఆ ఆ ఆ . . . సుడిలో దూకీ ఎదురీదకా. ఆ ఆ... మునకే సుఖమనుకోవోయ్... మునకే సుఖమనుకోవోయ్... కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్. ఓడిపోలేదోయ్. ఓ ఓ ఓయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ మేడలోనే అల పైడి బొమ్మా. నీడనే చిలకమ్మా. ఆ ఆ ఆ ఆ... మేడలోనే అల పైడి బొమ్మా. నీడనే చిలకమ్మా... ఆ ఆ... కొండలే రగిలే వడగాలీ. కొండలే రగిలే వడగాలీ నీ సిగలో పూవేలోయ్. నీ సిగలో పూవేలోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ చందమామా మసకేసి పోయే. ముందుగా కబురేలోయ్. ఓ ఓ ఓ... ఓ య్... చందమామా మసకేసి పోయే. ముందుగా కబురేలోయ్ . ఓ ఓ య్. లాయిరీ నడిసంద్రములోనా. లాయిరీ నడిసంద్రములోనా లంగరుతో పని లేదోయ్. లంగరుతో పని లేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్. ఓడిపోలేదోయ్. ఓ ఓ ఓయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

Devadasu (ANR) : Antha Bhranthiyena Song Lyrics (అంతా బ్రాంతియేనా)

చిత్రం: దేవదాసు (1953)

సాహిత్యం: సముద్రాల సీనియర్

సంగీతం: సి.ర్.సుబ్బురామన్, ఎం.యస్.విశ్వనాథన్

గానం: కే.జమున రాణి




అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా చిలిపితనాల చెలిమే మరచితివో.. చిలిపితనాల చెలిమే మరచితివో.. తల్లిదండ్రుల మాటే దట వెరచితివో తల్లిదండ్రుల మాటే దట వెరచితివో పేదరికమ్ము ప్రేమపథమ్ము మూసివేసినదా నా ఆశే దోచినదా అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా మనసునలేని వారి సేవలతో మనసునలేని వారి సేవలతో మనసీయగలేని నీపై మమతలతో మనసీయగలేని నీపై మమతలతో వంతలపాలై చింతించే నా వంతా దేవదా నా వంతా దేవదా అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా 

ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా