చిత్రం: దేవదాసు (1953)
సాహిత్యం: సముద్రాల సీనియర్
సంగీతం: సి.ఆర్.సుబ్బురామన్, ఎం.యస్.విశ్వనాథన్
గానం: కే.జమున రాణి
అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా
అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా
చిలిపితనాల చెలిమే మరచితివో..
చిలిపితనాల చెలిమే మరచితివో..
తల్లిదండ్రుల మాటే దట వెరచితివో
తల్లిదండ్రుల మాటే దట వెరచితివో
పేదరికమ్ము ప్రేమపథమ్ము మూసివేసినదా
నా ఆశే దోచినదా
అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా
మనసునలేని వారి సేవలతో
మనసునలేని వారి సేవలతో
మనసీయగలేని నీపై మమతలతో
మనసీయగలేని నీపై మమతలతో
వంతలపాలై చింతించే నా వంతా దేవదా
నా వంతా దేవదా
అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి