17, ఆగస్టు 2022, బుధవారం

Megha Sandesam : Aakulo Aakunai Song lyrics (ఆకులో ఆకునై)

చిత్రం: మేఘసందేశం (1982)

సాహిత్యం: వేటూరి

సంగీతం: రమేష్ నాయుడు

గానం: పి. సుశీల



ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై జలజలనీ పారు సెల పాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు చేటినై పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై ఆకలా దాహమా చింతలా వంతలా ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడ ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి