30, అక్టోబర్ 2022, ఆదివారం

Athadu : Avunu Nijam Song Lyrics (అవును నిజం )

చిత్రం: అతడు (2005)

సంగీతం: మణిశర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కే.కే, సునీత



పల్లవి :

M⚘అవును నిజం నువ్వంటే నాకిష్టం
F⚘ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం     చలి పరదా ఇక నిలవదుగా M⚘ తెలుసుకదా అఆఅఆ        తెలిసిందే.. అడగాలా.. F⚘ అడగందే.. అనవేలా.. M⚘చెవిలో ఇలా.. చెబితే చాలా        అవును నిజం నువ్వంటే నాకిష్టం చరణం : 1
F⚘ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం F⚘కసిరేస్తున్న మనసుకు వినపడదో ఏమో     విసిరేస్తున్న నినువిడి వెనకకి రాదేమో M⚘నిదరోతున్న ఎదురై కనపడతావేమో        కదలాలన్న కుదరని మెలి పెడతావేమో F⚘అంతగా కంట చూడనని     మొండికేస్తే తప్పేమో M⚘ఒంటిగా ఉండనీయనని ముందు కొస్తే ముప్పేమో F⚘మన సలహా మది వినదుకద     తెలుసుకదా ఆ ఆ ఆ ఆ M⚘తెలిసే ఇలా.. చెలరేగాలా         అవును నిజం నువ్వంటే నాకిష్టం F⚘ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చరణం : 2
M⚘సుడి గాలిలో తెలియని పరుగులు తీస్తున్నా        జడపూలతో చెలిమికి సమయము దొరికేనా F⚘ఎదరేముందో తమరిని వివరములడిగానా      యద ఏమందో వినమని తరుముకు రాలేనా M⚘తప్పుకో.. కళ్ళుమూసుకుని         తుళ్ళి రాకే నా వెంట F⚘ఒప్పుకో.. నిన్ను నమ్మమని     అల్లుకుంట నీ జంట M⚘ నడపదుగా నిను నది వరద         తెలుసు కదా ఆ ఆ ఆ ఆ F⚘ తెలిసే ఇలా ముంచెయ్యాల M⚘ అవును నిజం నువ్వంటే నాకిష్టం F⚘ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం చలి పరదా ఇక నిలవదుగా M⚘తెలుసుకదా అఆఅఆ తెలిసిందే.. అడగాలా.. F⚘అడగందే అనవేలా M⚘చెవిలో ఇలా చెబితే చాలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి