30, అక్టోబర్ 2022, ఆదివారం

Johnny : Ee Reyi Theyanadi Song Lyrics (ఈ రేయి తీయనిది)

చిత్రం : జానీ (2003)

సంగీతం : రమణ గోగుల

సాహిత్యం :

గానం: హరి హరన్, కవితా కృష్ణమూర్తి 




పల్లవి: ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం 1: ఓ వరములా దొరికెనీ పరిచయం నా మనసులో కురిసెనే అమృతం నా నిలువునా అలలయే పరవశం నీ చెలిమికే చేయని అంకితం కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం 2: నీ ఊపిరే వెచ్చగా తగలని నా నుదుటిపై తిలకమై వెలగని నా చూపులే చల్లగా తాకని నీ పెదవిపై నవ్వుగా నిలవని ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి