చిత్రం : చెప్పవే చిరుగాలి (2004)
సంగీతం : S.A .రాజ్ కుమార్
సాహిత్యం : శివ గణేష్
గానం: సుజాత
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నదిలాగ నీవు కదలాడుతుంటే
నీతోపాటూ సాగేతీరం నేనవ్వనా
నిశిరాత్రి నీవు నెలవంక నేను
నీతోపాటూ నిలిచే కాలం చాలందునా
మొగ్గై ఎదురొచ్చీ వనముగ మారావూ
కలలే నాకిచ్చీ కనులను దోచావూ
ఎదలయలోన లయమయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వూ
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
భువిలోన గాలి కరువైన వేళా
నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా
నీలాల నింగీ తెలవారకుంటే
నా జీవాన్నీ నీకూ దివ్వెగ అందించనా
శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా
అలలా నువు రాగా అలజడి అవుతున్నా
దీపం నువ్వైతె నీ వెలుగు నేనవ్వనా నీలో సగమవ్వనా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేక నేనే నువ్వా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి